Shoaib Akthar Feels Questions Raised If New Zeland Lost Match Vs AFG.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్‌లో అక్తర్ మాట్లాడుతూ.. ''అఫ్గాన్‌తో పోరులో కివీస్ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్ అభిమానులు ఊరుకోరని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. టి20 ప్రపంచకప్‌కు ముందు భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసుకున్న సంగతి పాక్ అభిమానులు మరిచిపోలేదు. పాక్, కివీస్ చేతిలో దారుణ పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్‌పై ఘన విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చింది.
చదవండి: T20 WC: అదొక్కటే దారి.. అలా అయితే భారత్ సెమీస్
ఇప్పుడు టీమిండియా సెమీస్ వెళ్లాలంటే అఫ్గాన్ చేతిలో కివీస్ ఓడిపోవడం ఒక్కటే మార్గం. ఒకవేళ అలా జరిగితే మాత్రం టీమిండియా సెమీస్‌కు వెళ్లాలని న్యూజిలాండ్ కావాలనే ఓడిపోయిదంటూ పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం ఖాయం. అలా జరగకూడదంటే అఫ్గాన్‌పై కివీస్ విజయం సాధిస్తే సరిపోతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే అక్తర్ టీమిండియా, పాకిస్తాన్‌లు ఫైనల్లో తలపడితే చూడాలని ఉందంటూ రెండురోజులు క్రితం చేసిన ప్రకటన మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక సూపర్ 12 దశ ముగుస్తున్న కొద్ది సెమీస్ రేసు ఉత్కంఠంగా మారిపోతూ వస్తోంది. ఇప్పటికే గ్రూఫ్ -1 నుంచి ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు పోటీ పడుతున్నాయి. ఇక గ్రూఫ్-2 నుంచి పాకిస్తాన్ సెమీస్‌కు క్వాలిఫై కాగా.. రెండో స్థానం కోసం న్యూజిలాండ్, టీమిండియా, అఫ్గానిస్తాన్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నవంబర్ 7న అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో టీమిండియా భవితవ్యం తేలనుంది.
చదవండి: Ravindra Jadeja: ఇంకేం చేస్తాం.. బ్యాగులు సర్దేసి ఇంటికి వెళ్తాం.. ఇచ్చిపడేశావ్ కదా భయ్యా!
World Cup becomes very interesting. It seems like India is heading closer to the miracle which looked impossible.
— Shoaib Akhtar (@shoaib100mph) November 5, 2021
New Zealand will be under a lot of pressure against Afghanistan. It will be a virtual quarter final for them.
Full video: https://t.co/OTfprrwjZi pic.twitter.com/syzyk5BSVD
Comments
Please login to add a commentAdd a comment