నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన నమీబియా.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం
165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. డేవిడ్ వీజ్(40 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో జేజే స్మిట్(8 బంతుల్లో 14) ధాటిగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో నమీబియా 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లు ఫ్రెడ్ క్లాసీన్, కొలిన్ ఆకెర్‌మాన్, పీటర్ సీలార్ తలో వికెట్ పడగొట్టారు.
నమీబియా టార్గెట్ 165.. 10 ఓవర్ల తర్వాత 68/3
165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టెఫాన్ బార్డ్(20 బంతుల్లో 19), జేన్ గ్రీన్(12 బంతుల్లో 15), వన్ డౌన్ బ్యాటర్ క్రెయిగ్ విలియమ్స్(13 బంతుల్లో 11) ఔటయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లు ఫ్రెడ్ క్లాసీన్, కొలిన్ ఆకెర్‌మాన్, పీటర్ సీలార్ తలో వికెట్ పడగొట్టారు. క్రీజ్‌లో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(10), డేవిడ్ వీజ్(8) ఉన్నారు.
చెలరేగిన నెదర్లాండ్స్ ఓపెనర్.. నమీబియా టార్గెట్ 165
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్(56 బంతుల్లో 70; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓడౌడ్‌కు మిడిలార్డర్ బ్యాటర్ కొలిన్ ఆకెర్‌మాన్(32 బంతుల్లో 35; ఫోర్, సిక్స్), వికెట్‌కీపర్ స్కాట్ ఎడ్వర్డ్స్(21 నాటౌట్) సహకరించడంతో నెదర్లాండ్స్ ఓ మోస్తరు భారీ స్కోర్ సాధించగలిగింది. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింగ్ రెండు వికెట్లు పడగొట్టగా. డేవిడ్ వీజ్‌కు ఓ వికెట్ దక్కింది.
అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
నెదర్లాండ్స్: మాక్స్ ఆడౌడ్, స్టెఫాన్ మైబుర్గ్, బాస్ డీ లీడే, కొలిన్ ఆకెన్‌మాన్, రియాన్ టెన్ డొచేట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), రోలోఫ్ వాన్ దెర్ మెర్వీ, పీటర్ సీలార్(కెప్టెన్), లాగన్ వాన్ బీక్, టిమ్ వాండర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసీన్.
నమీబియా: స్టీఫెన్ బార్డ్, జానే గ్రీన్, క్రెయిగ్ విలియమ్స్, గెర్హాడ్ ఎరాస్‌మస్(కెప్టెన్), డేవిడ్ వీజ్, జేజే స్మిత్, మైఖేల్ వాన్ లింగెన్, జాన్ ఫ్రిలింక్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ షోల్ట్.
Comments
Please login to add a commentAdd a comment