టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూఫ్-ఏ క్వాలిఫయింగ్ పోరులో గురువారం నమీబియా, యూఏఈ మధ్య ఆసక్తికర మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఏంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన నమీబియా ఫేవరెట్‌గా కనిపిస్తుంటే.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా చూడాలి. అయితే నమీబియాతో పోరు యూఏఈ కంటే నెదర్లాండ్స్‌కు చాలా ముఖ్యం.
ఎందుకంటే యూఏఈ గెలుపుపైనే నెదర్లాండ్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. అది కూడా కష్టమే(నెట్ రన్‌రేట్ ఆధారంగా). శ్రీలంకతో మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓడిన నెదర్లాండ్స్ దాదాపు ఇంటి బాట పట్టినట్లే. అయితే యూఏఈ నమీబియాను చిత్తుగా ఓడిస్తేనే నెదర్లాండ్స్‌కు సూపర్-12 చాన్స్ ఉంటుంది. ఎందుకంటే నమీబియా రన్‌రేట్ (+1.277) కాగా.. నెదర్లాండ్స్ రన్‌రేట్(0.162)గా ఉంది. ఒకవేళ యూఏఈ చేతిలో నమీబియా దగ్గరగా ఓడిపోయినా నెదర్లాండ్స్ ఇంటికి వెళ్లాల్సిందే. అయితే వరుసగా రెండు విజయాలు సాధించిన నమీబియా జోరును యూఏఈ ఏ మాత్రం అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ముహమ్మద్ వసీమ్, వృత్య అరవింద్(వికెట్ కీపర్), చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, కార్తీక్ మెయ్యప్పన్, ఫహద్ నవాజ్, అహ్మద్ రజా, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్
నమీబియా: స్టీఫన్ బార్డ్, మైఖేల్ వాన్ లింగెన్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జాన్ ఫ్రైలింక్, జెజె స్మిత్, డేవిడ్ వైస్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో
Comments
Please login to add a commentAdd a comment