మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లోని కూనో నేషనల్ పార్క్‌కు సంబంధించిన ఒక వార్త కలకలం రేపుతోంది. కూనో అభయారణ్యంలో చీతాలను స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత.. ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ అభయారణ్యంలోని పాల్పుర్ బీట్ సమీపంలో నమీబియా, సౌతాఫ్రికా చీతాల మధ్య పోరాటం జరిగింది. ఈ దాడులలో ‘అగ్ని’ అనే చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి కూనో పాల్పుర్ పశువైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది.
కూనో నేషనల్ పార్కులో సౌత్ ఆఫ్రికా,నమీబియాకు చెందిన చిరుతలు ఉన్నాయి. వీటిని ఈ అభయారణ్యంలో విడిచిపెట్టారు. వీటిని వేర్వేరు దిశలలో రిలీజ్ చేశారు. అయితే ఈ విశాల అరణ్యంలో ఉంటున్న ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి.
‘అగ్ని’కి ప్రత్యేక వైద్యం..
తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలతో నమీబియాకు చెందిన ‘శౌర్య’, ‘గౌరవ్’లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘అగ్ని’ తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ చిరుతను మానిటరింగ్ చేస్తున్న టీమ్ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన ‘అగ్ని’కి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
ఆగని పోరాటాలు..
కూనో నేషనల్ పార్క్ డీఎఫ్‌ఓ ప్రకాశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అభయారణ్యంలోని ‘అగ్ని’ అనే ఆడ చీతా గాయపడిందని, దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దాని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా నమీబియా నుంచి కూనో పార్కుకు తీసుకు వచ్చిన ‘శౌర్య’, ‘గౌరవ్’ చిరుతలు కవలలు. అవి భారత్‌కు వచ్చినప్పటి నుంచి కలివిడిగానే ఉంటున్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలు వేర్వేరుగా మసలుతున్నాయి. ఇరుప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు..
Comments
Please login to add a commentAdd a comment