బార్బడోస్: టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో స్కాట్లాండ్ తొలి విజయం నమోదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఐదు వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. ఇంగ్లండ్–స్కాట్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఈ గెలుపుతో స్కాట్లాండ్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలోకి వెళ్లింది.
స్కాట్లాండ్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెపె్టన్ ఎరాస్మస్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. బ్రాడ్ వీల్ 3, బ్రాడ్ కరీ 2 వికెట్లు తీశారు. అనంతరం స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది.
కెప్టెన్ బెరింగ్టన్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మైకేల్ లీస్క్ (17 బంతుల్లో 35; 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి స్కా ట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
టి20 ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్
వేదిక: గయానా; ఉదయం గం. 5 నుంచి
బంగ్లాదేశ్ X శ్రీలంక
వేదిక: డాలస్; ఉదయం గం. 6 నుంచి
దక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్
వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచి
ఆ్రస్టేలియా X ఇంగ్లండ్
వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 10:30 నుంచి
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment