ప్రపంచకప్‌ 2024లో నేటి (జూన్‌ 6) మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్‌ ఆడనున్న పాక్‌ | T20 World Cup 2024 June 6: Pakistan To Take On USA, Namibia To Fight Against Scotland | Sakshi

ప్రపంచకప్‌ 2024లో నేటి (జూన్‌ 6) మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్‌ ఆడనున్న పాక్‌

Jun 6 2024 11:21 AM | Updated on Jun 6 2024 11:30 AM

T20 World Cup 2024 June 6: Pakistan To Take On USA, Namibia To Fight Against Scotland

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 6) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. డల్లాస్‌ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ, పాకిస్తాన్.. బార్బడోస్‌లో జరుగునున్న రెండో మ్యాచ్‌లో నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు.. నమీబియా-స్కాట్లాండ్‌ మ్యాచ్‌ మధ్య రాత్రి 12:30 గంటలకు మొదలవుతాయి.  

ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ఇవాళ ఆడబోయే మ్యాచ్‌ తొలి మ్యాచ్‌ కాగా.. యూఎస్‌ఏ ఇదివరకే ఓ మ్యాచ్‌ ఆడింది. కెనడాతో జరిగిన  మ్యాచ్‌లో యూఎస్‌ఏ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో భారత్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

నమీబియా-స్కాట్లాండ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. గ్రూప్‌-బిలో పోటీపడుతున్న ఈ ఇరు జట్లు ఇదివరకే తలో మ్యాచ్‌ ఆడాయి. నమీబియా తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించగా.. స్కాట్లాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం నమీబియా గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్‌ నాలుగో స్థానంలో ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement