
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది.
స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
HISTORY BY TRISHA 🇮🇳
- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.
19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది.
సెమీస్‌లో భారత్
గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!
ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి.

Comments
Please login to add a commentAdd a comment