డచ్ యువ బ్యాటర్ సునామీ ఇన్నింగ్స్ (PC: ICC)
నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ యువ క్రికెటర్ మైకేల్ లెవిట్ దుమ్ములేపాడు. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఎనిమిది సిక్సర్లు, ఏడు బౌండరీల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు లెవిట్. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి ఇదే తొలి శతకం. కాగా నేపాల్ వేదికగా నమీబియా- నెదర్లాండ్స్- నేపాల్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగుతోంది.
ఇందులో భాగంగా తొలి టీ20లో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆతిథ్య నేపాల్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఓపెనింగ్ బ్యాటర్ మైకేల్ లెవిట్.. నేపాల్‌పై అర్ధ శతకం(54) బాదాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లోనూ బ్యాట్ ఝులిపించిన లెవిట్.. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లెవిట్‌కు తోడు వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ అద్భుత అర్థ శతకం(40 బంతుల్లో 75)తో రాణించాడు. ఇద్దరూ కలిసి ఏకంగా రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో లెవిట్, సైబ్రండ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది.
కాగా కీర్తిపూర్‌లో నమీబియాతో జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఈ మేరకు భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ తరఫున టీ20లలో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా మైకేల్ లెవిట్ చరిత్రకెక్కాడు. మాక్స్ ఒడౌడ్ లెవిట్ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment