సెమిస్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్.. నమీబియాపై ఘన విజయం
190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నీర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులకే పరిమితమైంది. దీంతో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. గ్రూపు 2 నుంచి సెమిస్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.నమీబియా జట్టులో విలియమ్స్(40),డేవిడ్ వైస్(43) టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రౌఫ్ చెరో వికెట్ సాదించారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఓపెనర్లు బాబర్ అజమ్(70), మహ్మద్ రిజ్వాన్(79) పరుగులతో చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ అజమ్(70), మహ్మద్ రిజ్వాన్(79),మహ్మద్ హఫీజ్(32) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైస్,ఫ్రైలింక్ చెరో వికెట్ సాధించారు.
మూడో వికెట్ కోల్పోయిన నమీబియా.. విలియమ్స్(40) ఔట్
93 పరుగుల వద్ద నమీబియా మూడో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన విలియమ్స్, షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో హసన్ అలీకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
రెండో వికెట్ కోల్పోయిన నమీబియా ..స్టీఫన్ బార్డ్(29) ఔట్
స్టీఫన్ బార్డ్ రూపంలో నమీబియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన బార్డ్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.12 ఓవర్లు ముగిసేసరికి నమీబియా 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రెయిగ్ విలియమ్స్(14),ఎరాస్మస్(15) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన నమీబియా .. వాన్ లింగెన్(4) ఔట్
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగలు చేసిన వాన్ లింగెన్, హసన్ ఆలీ బౌలింగ్ క్లీన్ బౌల్డ్‌య్యాడు. 8 ఓవర్లు ముగిసేసరికి నమీబియా వికెట్ నష్టానికి పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రెయిగ్ విలియమ్స్(14),.స్టీఫన్ బార్డ్(26) పరగులతో ఉన్నారు.
చేలరేగిన పాక్ ఓపెనర్లు.. నమీబియా టార్గెట్ 190 పరుగులు
ఓపెనర్లు బాబర్ అజమ్(70), మహ్మద్ రిజ్వాన్(79) పరుగులతో చేలరేగడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ అజమ్(70), మహ్మద్ రిజ్వాన్(79),మహ్మద్ హఫీజ్(32) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైస్,ఫ్రైలింక్ చెరో వికెట్ సాధించారు.
తొలి వికెట్ కోల్పోయిన పాక్.. బాబర్ ఆజమ్(70) ఔట్
నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ అజమ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన అజామ్.. డేవిడ్ వైస్ బౌలింగ్‌లో జాన్ ఫ్రైలింక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 115 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్ రెండు వికెట్లు నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(32), మహ్మద్ హఫీజ్(29) పరుగులతో ఉన్నారు.
బాబర్ అజమ్ ఆర్ధసెంచరీ.. 12 ఓవర్లు ముగిసేసరికి 89/0
నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఆర్ధసెంచరీ సాధించాడు. 12ఓవర్లు ముగిసేసరికి పాక్ వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(48),(56) పరుగులతో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు...
నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ నిలకడగా ఆడుతుంది. పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంనుంచి నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి పాక్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(12),బాబర్ అజమ్(33) పరుగులతో ఉన్నారు
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న నమీబియా.. పాక్ స్కోర్ 13/0
సమయం 19:45: పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 13 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(2),బాబర్ అజమ్(11) పరుగులతో ఉన్నారు. కాగా పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను ట్రంపెల్‌మాన్ మెయిడిన్ చేశాడు.
అబుదాబి: టి20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా గ్రూప్ 2లో పాకిస్తాన్‌తో నమీబియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్‌మీద ఉన్న పాకిస్తాన్.. నమీబియాపై విజయం సాదించి సెమిఫైనల్లో అడుగు పెట్టాలని భావిస్తోంది. మరో వైపు మునుపటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి చెందిన నమీబియా.. పాక్‌కు ఎంతవరకు పోటి ఇస్తుందో చూడాలి.
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజమ్(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది
నమీబియా : క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వైస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, స్టీఫన్ బార్డ్ , జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్
చదవండి: వాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్ వద్దు: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment