టీ20 ప్రపంచకప్-2022 తొలి రౌండ్(గ్రూప్-ఎ) పోటీలు ముగిశాయి. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు సూపర్-12 అర్హత సాధించాయి. జీలాంగ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో నమీబియా పరాజయం పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్‌లో నమీబియా ఓటమి చెందడంతో నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది.
నెదర్లాండ్స్ రెండు విజయాలతో ఈ ప్రధాన టోర్నీలో అడుగు పెట్టింది. ఒక వేళ యూఏఈపై నమీబియా విజయం సాధించింటే రన్‌రేట్ పరంగా సూపర్-12లో అడుగుపెట్టేది. ఇక ఇది ఇలా ఉండగా.. గురువారం ఉదయం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ఓటమి పాలైంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ ఆటగాళ్లు తమ హోటల్ గదులకు వెళ్లకుండా తమ భవితవ్యం తేల్చే యూఏఈ-నమీబియా మ్యాచ్‌ను వీక్షించారు.
కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ విజయం సాధించగానే డచ్ ఆటగాళ్ళు సెలబ్రేషన్‌లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రూప్-బి నుంచి ఏ జట్లు సూపర్-12లో అడుగుపెడతాయో శుక్రవారం తేలిపోనుంది.
గ్రూప్-బి స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లన్నీ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గెలుపోటములతో రేసులో ఉన్నాయి. శుక్రవారం(ఆక్టోబర్21) ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్‌తో ఐర్లాండ్... స్కాట్లాండ్‌తో జింబాబ్వే తలపడతాయి. గెలిస్తే చాలు... ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా గెలిచిన రెండు జట్లు ‘సూపర్–12’ దశకు అర్హత సాధిస్తాయి.
Celebration by the Dutch cricket team, having just qualified for the follow-up by the narrow defeat of Namibia by UAE. Yet another nail biting experience. #ICCT20WC2022 #ICCT20WC @T20Worldcup #Australia #CricketNL @KNCBcricket pic.twitter.com/pVNjMVYgUG
— VRA Cricket Amsterdam (@VRA_Cricket_AMS) October 20, 2022
చదవండి: T20 WC 2022: 'అతడు ఒంటి చేత్తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందిస్తాడు'
Comments
Please login to add a commentAdd a comment