
టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూఫ్-ఏలో మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. తమ తొలి మ్యాచ్‌లో లంకను చిత్తు చేసిన నమీబియా డచ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మైకెల్ వాన్ లింగెన్ 20 పరుగులు చేశాడు.
ఆరంభం నుంచి నెమ్మదిగా సాగిన నమీబియా ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 2 వికెట్లు తీయగా.. టిమ్ ప్రింగిల్, కోలిన్ అకెర్‌మన్, పాల్ వాన్ మెక్రీన్, వాండర్‌మెర్వ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
చదవండి: సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్‌గా పనికిరావు'
Comments
Please login to add a commentAdd a comment