నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్‌ | Nepal T20I Tri Series 2024: Nepal Beat Namibia By 3 Runs | Sakshi
Sakshi News home page

నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్‌

Published Fri, Mar 1 2024 5:53 PM | Last Updated on Fri, Mar 1 2024 6:08 PM

Nepal T20I Tri Series 2024: Nepal Beat Namibia By 3 Runs - Sakshi

స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో నేపాల్‌ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో ఇవాళ (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (55 నాటౌట్‌) మెరుపు అర్దసెంచరీతో రాణించాడు. ఆరిఫ్‌ షేక్‌ (31), అనిల్‌ షా (23), గుల్షన్‌ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్‌ షికోంగొ 3, జాక్‌ బ్రస్సెల్‌ 2, ట్రంపల్‌మెన్‌, లాఫ్టీ ఈటన్‌, బెర్నాల్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్మిట్‌ (50) అర్దసెంచరీతో చెలరేగినా  నమీబియాను గెలిపించలేకపోయాడు.

ఆఖర్లో జేన్‌ గ్రీన్‌ (23), బెర్నాల్డ్‌ (4 నాటౌట్‌) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్‌ బౌలర్లలో కరణ్‌, సోమ్‌పాల్‌, దీపేంద్ర సింగ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్‌ బొహారా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement