స్కాట్లాండ్‌పై నమీబియా విజయం
సమయం: 22:52.. టి20 ప్రపంచకప్ 2021లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. జెజె స్మిత్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్రెయిగ్ విలియమ్స్ 23 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైకెల్ లీస్క్ 2, బ్రాడ్‌లీ వీల్, సఫయాన్ షరీఫ్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాల్ట్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్రిస్ గ్రీవ్స్ 25 రాణించాడు. ఈ విజయంతో నమీబియా సూపర్ 12 దశలో బోణీ కొట్టగా.. స్కాట్లాండ్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.
నాలుగో వికెట్ కోల్పోయిన నమీబియా
సమయం:22:17.. నమీబియా లక్ష్య చేధనలో తడబడుతుంది. తాజాగా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(4) లీస్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అంతకముందు జాన్ గ్రీన్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రెయిగ్ విలియమ్స్ 21, డేవిడ్ వీస్ 3 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన నమీబియా.. 6 ఓవర్లలో 29/1
సమయం: 21:48.. స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా తొలి వికెట్ కోల్పోయింది. నమీబియా ఓపెనర్ మైకెల్ వాన్ లింగెన్(18) ఇన్నింగ్స్ 5.3 ఓవర్‌లో సఫయాన్ షరీఫ్ బౌలింగ్‌లో బెరింగ్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రెయిగ్ విలియమ్స్ 7, జానే గ్రీన్స్ 1 పరుగుతో ఆడుతున్నారు.
3 ఓవర్లలో నమీబియా 13/0
సమయం: 21:28.. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. మైకెల్ వాన్ లింగెన్ 8, క్రెయిగ్ విలియమ్స్ 1 పరుగుతో ఆడుతున్నారు.
సమయం: 21:08.. నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్రిస్ గ్రీవ్స్ 25 రాణించాడు. అయితే తొలి ఓవర్‌లోనే రూబెన్ ట్రంపెల్‌మన్ బౌలింగ్ దాటికి మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్.. ఆ తర్వాత 18 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత లీస్క్, క్రాస్, క్రిస్ గ్రీవ్స్ తలా కొన్ని పరుగులు చేయడంతో స్కాట్లాండ్ కనీసం 100 పరుగులు దాటగలిగింది. నమీబియా బౌలర్లలో ట్రంపెల్‌మన్ 3, జాన్ ఫ్రైలింక్ 2, డేవిడ్ వీస్, స్మిత్ చెరో వికెట్ తీశారు.
18 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్ 99/6
సమయం: 20:56.. 18 ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.అంతకముందు 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్కాట్లాండ్.. మైకెల్ లీస్క్ 44 పరుగులతో గట్టెక్కించాడు. అతనికి మాథ్యూ క్రాస్ 19 పరుగులతో సహకరించాడు. కాగా క్రాస్ ఔటైన తర్వాత క్రిస్ గ్రీవ్స్ 21 పరుగులతో సహకరించాడు. అయితే 44 పరుగులు చేసిన లీస్క్ స్మిత్ బౌలింగ్‌లో బౌల్డ్ అవడంతో 96 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
8 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్ 22/4
సమయం: 20:00.. నమీబియా బౌలర్ల దెబ్బకు స్కాట్లాండ్ పరుగులు చేయడంలో నానా ఇబ్బందులు పడుతుంది. తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పోగొట్టుకోవడంతో పరుగులు చేయలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. లీస్క్ 8, క్రాస్ 15 పరుగులతో ఆడుతున్నారు.
సమయం: 19:35.. స్కాట్లాండ్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. సున్నా పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్‌కు ఆ తర్వాత వైడ్ రూపంలో రెండు పరుగులు అదనంగా వచ్చాయి. ఆ తర్వాత మూడు, నాలుగు బంతులకు మరో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం ఒక ఓవర్ ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 2 పరుగులు చేసింది. మొత్తానికి నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్‌మన్(1-0-2-3) తన తొలి ఓవర్ ద్వారానే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్
సమయం: 19:33.. నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ సున్నాకే తొలి వికెట్‌ను కోల్పోయింది. రూబెన్ ట్రంపెల్‌మన్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే మున్సీ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూఫ్-2 సూపర్ 12లో స్కాట్లాండ్, నమీబియా మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన నమీబియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టి20ల్లో ఇరుజట్లు తలపడిన రెండు సందర్బాల్లోనూ నమీబియానే విజయం వరించింది. ఇక అఫ్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో పరాజయం పాలైన స్కాట్లాండ్‌పై కాస్త ఒత్తిడి ఉండగా.. నమీబియాకు మాత్రం సూపర్ 12 దశలో ఇదే తొలి మ్యాచ్. ఇక స్కాట్లాండ్ రెగ్యులర్ కెప్టెన్ కొయెట్జర్ వేలి గాయంతో మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో రిచీ బెర్రింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
స్కాట్లాండ్ : జార్జ్ మున్సే, మాథ్యూ క్రాస్(వికెట్ కీపర్), కాలమ్ మాక్లియోడ్, రిచీ బెరింగ్టన్(కెప్టెన్), క్రెయిగ్ వాలెస్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవీ, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్
నమీబియా : క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వైస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్
Comments
Please login to add a commentAdd a comment