టి20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 122 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఒక దశలో సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. .
కానీ నమీబియా బౌలర్లు పోరాడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. అయితే నెదర్లాండ్స్ ఆటగాళ్లు బాస్ డీ లీడే 30, విక్రమ్‌జిత్ సింగ్ 39, మాక్స్ డౌడ్ 35 పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో జెజె స్మిత్ 2 వికెట్లు తీయగా.. బెర్నార్డ్ స్కోల్జ్, ఫ్రై లింక్‌లు చెరొక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మైకెల్ వాన్ లింగెన్ 20 పరుగులు చేశాడు. ఆరంభం నుంచి నెమ్మదిగా సాగిన నమీబియా ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 2 వికెట్లు తీయగా.. టిమ్ ప్రింగిల్, కోలిన్ అకెర్‌మన్, పాల్ వాన్ మెక్రీన్, వాండర్‌మెర్వ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ఇక గ్రూఫ్-ఏలో ఉన్న నెదర్లాండ్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసింది. దీంతో డచ్ జట్టు సూపర్-12 దశకు దాదాపు అర్హత సాధించినట్లే. క్వాలిఫయింగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నెదర్లాండ్స్ రెండు విజయాలు సాధించింది. ఇక డచ్ జట్టు తమ చివరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడనుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు అర్హత సాధించడంలో విఫలమైన నెదర్లాండ్స్ ఈసారి మాత్రం తమ పట్టు విడవలేదు. ఒకవేళ ఇవాళ శ్రీలంక పొరపాటున యూఏఈ చేతిల ఓడిందో ఇంటిదారి పట్టాల్సిందే. మరోవైపు నమీబియా మాత్రం రెండు మ్యాచ్‌ల్లో ఒక ఓటమి, ఒక విజయం సాధించి రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment