T20 World Cup 2021- Namibia Beat Scotland By 4 Wickets: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ దశలో అదరగొట్టిన నమీబియా సూపర్–12 రౌండ్‌లోనూ ఆకట్టుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి ఆడుతున్న నమీబియా బుధవారం జరిగిన గ్రూప్–2 లీగ్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లను ఓడించిన నమీబియా అదే జోరును కొనసాగించి తమ ఖాతాలో రెండు పాయింట్లు వేసుకుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు సాధించింది. లీస్క్ (44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నమీబియా 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసి విజయం సాధించింది. స్మిట్ (23 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నమీబియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ను నమీబియా పేస్ బౌలర్ రూబెన్ ట్రంపెల్మన్ (3/17) హడలెత్తించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రంపెల్మన్ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్‌ను దెబ్బ తీశాడు. ట్రంపెల్మన్ ధాటికి స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ జార్జి మున్సే, మెక్లియోడ్, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ ‘డకౌట్’గా వెనుదిరిగారు. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన నమీబియా ఈ మేరకు సంచలన విజయాలు నమోదు చేయడం పట్ల ఆ దేశ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంక్షిప్త స్కోర్లు
స్కాట్లాండ్ ఇన్నింగ్స్: 109/8 (20 ఓవర్లలో) (మాథ్యూ క్రాస్ 19, మైకేల్ లీస్క్ 44, క్రిస్ గ్రీవ్స్ 25, ట్రంపెల్మన్ 3/17, ఫ్రైలింక్ 2/10);
నమీబియా ఇన్నింగ్స్: 115/6 (19.1 ఓవర్లలో) (విలియమ్స్ 23, లింజెన్ 18, డేవిడ్ వీస్ 16, స్మిట్ 32 నాటౌట్, లీస్క్ 2/12).
చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment