
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. సెల్హాట్ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టీ20లో 3 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. 207 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆఖరి వరకు పోరాడింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 12 పరుగుల అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మదుల్లా(54) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో మాథ్యూస్, శనక, ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో సమరవిక్రమ(61), కుశాల్ మెండిస్(59) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఆఖరిలో కెప్టెన్ అసలంక(21 బంతుల్లో 44 పరుగులు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్‌ఫుల్ ఇస్లాం, టాస్కిన్ ఆహ్మద్, రిషాద్ హుస్సేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 6న జరగనుంది.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెగా కమిన్స్