బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్‌ సొంతం | Sri Lanka beat Bangladesh by 28 runs to clinch T20I series | Sakshi
Sakshi News home page

SL vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్‌ సొంతం

Published Sat, Mar 9 2024 8:34 PM | Last Updated on Sun, Mar 10 2024 7:53 AM

Sri Lanka beat Bangladesh by 28 runs to clinch T20I series - Sakshi

సెల్హాట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 28 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 19.4 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. లంక పేసర్‌ నువాన్‌ తుషారా 5 వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు.

తన 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ హ్యాట్రిక్‌ కూడా ఉంది. అతడితో పాటు కెప్టెన్‌ హసరంగా రెండు, షనక, తీక్షణ తలా వికెట్‌ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో రిసాద్‌ హొస్సేన్‌(53) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్‌ కుశాల్‌ మెండీస్‌(86) పరుగులతో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. బంగ్లా బౌలర్లలో రిసాద్‌ హొస్సేన్‌, టాస్కిన్‌ ఆహ్మద్‌ తలా వికెట్‌ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement