శ్రీలంక, బంగ్లాదేశ్
కొలంబో: ఓవైపు ప్రతీకారం.. మరోవైపు టైటిల్ పోరుకు అర్హత.. కానీ ఇద్దరి లక్ష్యం మాత్రం విజయం సాధించడం. ఈ నేపథ్యంలో ముక్కోణపు టీ20 టోర్నీలో సెమీస్‌లాంటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్‌తో తలపడుతుంది. తాజా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్ తొలుత లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ దూరంగా ఉన్న షకిబుల్ కీలక మ్యాచ్‌కు అందుకుబాటులోకి రావడంతో బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో పోరుకు సిద్ధమైంది.
మరొకవైపు లంకేయులు తీవ్ర ఒత్తిడితో మ్యాచ్‌కు సిద్దమయ్యారు. ఆడుతున్నది స్వదేశంలో కావడమే కాకుండా, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నీ. ఈ కారణాల రీత్యా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో లంకపైనే ఎక్కువ ఒత్తిడి నెలకొంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దాంతో బంగ్లాను ఓడించి ఫైనల్‌కు చేరాలంటే లంక పూర్తిస్థాయిలో ఆడకతప్పదు.
Comments
Please login to add a commentAdd a comment