బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాపై భారత్ గెలుపొందింది. 222 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి టి20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
తొలుత టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.
హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment