Team India Cricket
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాపై భారత్ గెలుపొందింది. 222 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి టి20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.తొలుత టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. -
ఓటమిని ఒప్పుకోవడమే క్రీడాస్ఫూర్తి
పది వరుస విజయాల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేసినందువల్ల... అతడిలో మనం ఆశించిన సౌమ్యతను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లలోనూ విజయం సాధించినట్లు అవుతుంది. అద్భుతంగా ఆడాడు. కానీ ఓడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. మన క్రికెటర్లు తమ ఓటమిని హూందాగా ఎలా స్వీకరించాలో నేర్చుకోవలసే ఉంది. పెద్దమనిషి అని ఒకర్ని అంచనా వేయడానికి ఉన్న అనేకమైన మార్గాలలో బహుశా అత్యంత సునిశి తమైనది... వారు ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంత గాంభీర్యాన్ని కలిగి ఉండటమేనని నేను చెప్పగలను. ఇక ఆ పెద్దమనిషి క్రీడాకారుడు అయితే కనుక ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నదీ, ‘మన చేతుల్లో పనే’ అనేంతగా మీరు తిరుగులేని నమ్మకంతో ఉన్నదీ... ఊహించని విధంగా మీ పట్టు నుంచి జారి, మిమ్మల్నొక కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలి కలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. గత ఆదివారం ఓటమి అనంతరం మన క్రికెట్ జట్టు నిలదొక్కుకోలేక పోయిన పరీక్ష ఇటువంటిదే. అందుకే నేను గుండెల్ని ముక్కలు చేసిన ఆ ప్రపంచ కప్పు పరాజయానికి భారత జట్టు ఎలా స్పందించిందో ఒక ఎంపికగా ఈ వారం రాయదలచాను. గొప్ప వీరులను మీరు మీ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకున్నప్పుడే, వారి రూపాలను పంకిలపరిచే లోపాలను సైతం సమస్థాయిలో అంగీకరించడం అన్నది కూడా మీ ఆరాధనలోని ఒక తప్పనిసరి బాధ్యత అవుతుంది.. ముఖ్యంగా టీవీల ప్రత్యక్ష ప్రసారంలో వీరులైన మీ జగజ్జెట్టీలను ప్రపంచం అంతా కళ్లింత చేసుకుని చూస్తున్నప్పుడు! ‘‘భారతజట్టులోని చాలామంది ఆటగాళ్లు... విజేతలైన ఆసీస్ జట్టులోని క్రీడాకారులతో కరచాలనం చేసిన తర్వాత మైదానం విడిచిపెట్టారు. కనీసం ప్యాట్ కమిన్స్ ట్రోఫీని పైకెత్తి చూపడాన్ని వీక్షించేంత వరకైనా అక్కడ ఉండలేకపోయారు’’ అని మేథ్యూ సాల్విన్ ‘న్యూస్.కామ్.ఎయు’లో రాశారు. అదే నిజమైతే అటువంటి ప్రవర్తన అమర్యాదకరమైనది మాత్రమే కాదు, క్షమించరానిది కూడా! ఈ ధోరణి భారత జట్టును, భారత ప్రజలను కూడా చెడుగా ప్రపంచానికి చూపెడుతుంది. విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందు కున్నప్పుడు అతడి ప్రవర్తనను నాకు నేనుగా గమనించాను. అతడు నిరుత్సాహానికి గురవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్థాయికి తగని అతడి వైఖరి మాత్రం నేను అంగీకరించలేనిది. సచిన్ టెండూల్కర్‌తో మాత్రమే కరచాలనం చేసి, తక్కిన వాళ్లలో ఒక్కర్ని కూడా కోహ్లీ పట్టించుకోలేదు. అది అమర్యాద మాత్రమే కాదు, క్షమార్హం కాని స్వీయాధిక్య భావన కూడా! కోహ్లీని మాత్రమే నేనెందుకు వేరు చేసి చూస్తున్నాను? రెండు కారణాల వల్ల. కోట్లాది మందికి అతడు హీరో. తన ఆదర్శపాత్రను గొప్ప సంపదగా సృష్టించుకున్నవాడు. అతడేం చేస్తే వాళ్లు దానిని అనుసరిస్తారు. అంతేనా, అనుకరిస్తారు కూడా! అందుకే అతడి తప్పి దాలు కనిపించకుండా పోవు. ఒక స్టార్‌గా అతడు ప్రశంసలకు ఎలాగైతే అర్హుడో, విమర్శలకూ అంతే యోగ్యుడు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనవచ్చు. పది వరుస విజయాల తర్వాత ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధా నాన్ని ప్రభావితం చేసినందువల్ల అతడిలో మనం ఆశించిన సౌమ్య తను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? అది నాకు సమ్మతి కాని వాదన. ఎందుకో నన్ను చెప్పనివ్వండి. 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అందరి మదిలోనూ ఒకటే, అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో అది అతడి నాలుగో గ్రాండ్ స్లామ్ విజయం అవుతుంది. 1969 నాటి రాడ్ లేవర్ ఘనతకు అతడిని సమం చేస్తుంది. పురుషుల టెన్నిస్‌లో ఒక ఏడాదిలోని గ్రాండ్ స్లామ్‌లు అన్నింటిలో విజయం సాధించిన మూడవ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు. కానీ ఏమైంది? ఓడిపోయాడు! ఏ లెక్కన చూసినా గత ఆదివారం విరాట్ కోహ్లీ చవి చూసిన ఓటమి కన్నా కూడా జొకోవిచ్ది చాలా పెద్ద ఓటమి. అంతేకాదు – అది చిన్న సంగతేం కాదు – పైగా వ్యక్తిగతమైనది. కనుక అది అసలు సిసలు పరీక్ష. జొకోవిచ్ అద్భుతంగా ఆడాడు. సందేహమే లేదు. అందుకే ఓటమి అతడిని కుంగదీసింది. అతడి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. డేనియల్ మెద్వెదేవ్ అతడిని ఓడించిన క్షణాలలో జెకోవిచ్ అతడితో ఏమన్నాడో చూడండి: ‘‘ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. చక్కగా ఆడారు. నిజంగానే చాలా చక్కగా! మంచి సమన్వయంతో ఉన్నారు. గ్లాండ్ స్లామ్ ప్రస్తుత పర్య టనల్లోని గొప్ప ఆటగాళ్లలో మీరు ఒకరు. మన మధ్య మంచి స్నేహపూర్వకమైన పోటీ నడిచింది. మీరింకా మరిన్ని గ్లాండ్ స్లామ్‌లు గెలవాలని, మరిన్ని మేజర్ లీగ్స్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ కూడా మీరు ఇలాంటి విజయాన్ని నిశ్చయంగా సాధించ గలరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని మెద్వేదేవ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు జొకోవిచ్. అదీ క్రీడాస్ఫూర్తి అంటే. అదీ పెద్దరికం అంటే. దురదృష్టవశాత్తూ గతవారం మన క్రికెట్ జట్టు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇక జొకోవిచ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా! ‘‘నేను మ్యాచ్ గెలవనప్పటికీ ఈ రాత్రి నా హృదయం పట్టనలవి కాని ఆనందంతో నిండి ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిమానంతో మీరు నాకు కలిగించిన ప్రత్యేకమైన అనుభూతి కారణంగా నేనిప్పుడు భూమి మీద జీవించి ఉన్నవారిలో అత్యంత సంతో షకరమైన వ్యక్తిని. మీరు నా హృదయాన్ని స్పృశించారు. న్యూయార్క్‌లో నేనెప్పుడూ ఇలా లేను. నిజాయతీగా చెబుతున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మిత్రులారా! నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం చేసిన ప్రతిదానికీ కూడా’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు. మన క్రికెటర్లు– ప్రధానంగా కోహ్లీ – గొప్ప క్రీడాకారులే అయినప్పటికీ వారు తమ ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో నేటికింకా నేర్చుకోవలసే ఉంది. ఇందుకు రెండు కావాలి. మొదటిది క్రీడా పరాక్రమం. రెండోది శ్రేష్ఠమైన అంతఃచేతనాశక్తి. రెండోది లేకుండా మాత్రం నిజంగా మీరు గొప్పవారు కాలేరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన శక్తి, వారి అభిరుచి మ్యాచ్ అంతా కనిపించిందని, ఈ గెలుపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జట్టుకు అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ తెలిపారు. (చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్క్ష్మణ్, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. కాగా ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌గా భావించే బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) January 19, 2021 EVERY SESSION WE DISCOVERED A NEW HERO. Every time we got hit, we stayed put & stood taller. We pushed boundaries of belief to play fearless but not careless cricket. Injuries & uncertainties were countered with poise & confidence. One of the greatest series wins! Congrats India. pic.twitter.com/ZtCChUURLV — Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021 Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND — VVS Laxman (@VVSLaxman281) January 19, 2021 The champions & the greatest chase!🙌#TeamIndia has proved it again by team efforts, great character, courage & max determination! Despite the bruises, the team made it possible for our country. That’s why we play for the country’s flag to go high every time we perfom🇮🇳#INDvAUS — Ishant Sharma (@ImIshant) January 19, 2021 -
సిరీస్‌పై గురి
కరీబియన్ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను అజేయంగా ముగించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. టి20ల్లో క్లీన్ స్వీప్ చేసి, రెండో వన్డేలో సునాయాస విజయం సాధించిన కోహ్లి సేన... ఆఖరిదైన మూడో వన్డేనూ హస్తగతం చేసుకుని సిరీస్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని చూస్తోంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్‌ను నిలువరించాలన్నా, తమ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలన్నా ఆ జట్టు శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: నిన్నటివరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానంపై సాగిన చర్చ... ఇప్పుడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ వైపు మళ్లింది. ప్రపంచ కప్‌లో అద్భుత సెంచరీతో ఊపుమీదున్న స్థితిలో గాయంతో వైదొలగిన ధావన్ పునరాగమనంలో పరుగులకు ఇబ్బంది పడుతున్నాడు. టి20ల్లో, రెండో వన్డేలో అతడు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. బుధవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ధావన్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. విజయాల ఊపులో ఉన్న భారత్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడితే మరో సిరీస్ మన ఖాతాలో చేరడం ఖాయం. సిరీస్‌ను సమ చేయడంతో పాటు కెరీర్లో ఆఖరి మ్యాచ్‌గా ప్రకటించిన గేల్‌ను గౌరవంగా సాగనంపడం ఇప్పుడు కరీబియన్ల ముందున్న రెండు లక్ష్యాలు. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే భారత్ బరిలో దిగనుండగా... విండీస్ ఒక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. అతడి ఆటపైనే దృష్టి... ధావన్ ఫామ్ కోసం కష్టాలు పడుతుండటంతో జట్టుకు శుభారంభాలు దక్కడం లేదు. రెండో వన్డేలో రోహిత్ కూడా విఫలమడంతో కష్టాల్లో పడింది. కెప్టెన్ కోహ్లి అద్భుత శతకం, యువ శ్రేయస్ అయ్యర్ సమయోచిత అర్ధసెంచరీతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో ఓపెనర్లు రాణిస్తే భారత్ ఆదిలోనే పైచేయి సాధిస్తుంది. పలుసార్లు విఫలమైనా నాలుగో నంబరులో రిషభ్ పంత్‌నే దించే అవకాశం కనిపిస్తోంది. ఆరో స్థానంలో వచ్చే జాదవ్‌కూ ఈ మ్యాచ్ కీలకమే. స్పిన్ ద్వయం జడేజా, కుల్దీప్... పేస్ త్రయం షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్‌లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది. వీరిని ఎదుర్కొంటూ పరుగులు సాధిచండం ప్రత్యర్థికి బ్యాట్స్‌మెన్‌కు సవాలేనని రెండో వన్డేలో స్పష్టమైంది. ఓ దశలో చేజారేలా కనిపించిన మ్యాచ్‌ను బౌలర్లు మనవైపు తిప్పారు. మూడో వన్డేలోనూ ఇదే జోరు చూపితే ప్రపంచ కప్ నిష్క్రమణను మరిపిస్తూ టెస్టు చాంపియన్ షిప్‌నకు ఆత్మవిశ్వాసంతో వెళ్లొచ్చు. విండీస్‌కు బ్యాటింగ్ బెంగ... బౌలింగ్‌లో ఫర్వాలేకున్నా బ్యాటింగ్ వెస్టిండీస్‌ను కలవరపరుస్తోంది. విధ్వంసక క్రిస్ గేల్ తన ఆఖరి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్‌లతో భారీ లైనప్ ఉన్నా ఎవరి నుంచి విన్నింగ్ ఇన్నింగ్స్ రావడం లేదు. ఆరు వికెట్లు చేతిలో ఉన్నా రెండో వన్డేలో 71 బంతుల్లో 91 పరుగుల చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. ఓపెనర్లలో లూయిస్ స్థానంలో క్యాంప్‌బెల్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నా అందుకు పెద్దగా అవకాశాల్లేవు. లోయరార్డర్లో కెప్టెన్ హోల్డర్, బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిప్తేనే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. పార్ట్‌టైమర్ చేజ్‌తో కొంత ప్రయత్నిస్తున్నా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం విండీస్‌కు లోటు. రోచ్, కాట్రెల్, థామస్‌ల పేస్ త్రయం అనూహ్యంగా చెలరేగితే టీమిండియాకు కళ్లెం పడుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్), అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఖలీల్. వెస్టిండీస్: గేల్, లూయిస్/క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, హోల్డర్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్, థామస్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అంతంతమాత్రమే సహకరించిన, రెండో వన్డే ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ జరగనుంది. వాతావరణ పరిస్థితులు చూస్తే అంతరాయాలు తప్పకపోవచ్చని సమాచారం. జల్లుల వాన కురిసే వీలుంది. ఈ ప్రకారం చూస్తే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవచ్చు. -
వరుణ దేవుడా... క్రికెట్ మ్యాచ్‌లకు అడ్డురాకు...!
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ సందర్భంగా... భారత మ్యాచులకు అడ్డు పడొద్దు వరుణుడా..!? అని సగటు అభిమానులు ప్రార్థించడం సర్వ సాధారణం. కానీ, బీమా కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా భారత మ్యాచులు రద్దయితే బీమా కంపెనీలు పరిహారం రూపంలో రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత్ మరో నాలుగు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఈ నాలుగు కూడా వర్షం కారణంగా రద్దు కావన్న ఆశలతో బీమా కంపెనీలు ఉన్నాయి. తొలి దశలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా కోల్పోవాల్సి వచ్చిన విషయం గమనార్హం. ప్రస్తుత ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు వర్షం అడ్డుతగిలింది. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి మన దేశంలో రూ.150 కోట్ల బీమా మార్కెట్ ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ఈ తరహా బీమా పాలసీలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. క్లెయిమ్స్ ఎదురైతే వీటిపైనే ఎక్కువ భారం పడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌కు రూ.50కోట్లు భారీగా వెచ్చించి ఐసీసీ క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ప్రసార మాధ్యమాలు సాధారణంగా క్రికెట్ మ్యాచులు రద్దయితే తలెత్తే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ పాలసీలను తీసుకుంటుంటాయి. దీంతో వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా, వర్షం కారణంగా అవరోధం ఏర్పడి మ్యాచ్‌ను కుదించడం వల్ల ప్రకటనల ఆదాయం నష్టపోవడం జరిగినా పరిహారం పొందొచ్చు. మ్యాచ్ యథావిధిగా జరిగితే బీమా కంపెనీలు ఊపిరిపీల్చుకున్నట్టే. భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏకంగా రూ.50 కోట్ల బీమా తీసుకోవడం దీనికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు... ఒక్కో మ్యాచ్ ప్రసార సమయంలో ప్రకటనలపై రూ.5–50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అదే ఫైనల్స్, సెమీ ఫైనల్స్ వంఇ ప్రత్యేక మ్యాచుల్లో ఈ ఆదాయం రూ.70–80 కోట్ల వరకు ఉంటుంది. -
బౌలింగ్ బలంతోనే సంచలనం
► టీమ్ ఇండియాకు అదే అత్యవసరం ► ‘క్వార్టర్స్’ తర్వాత అదే విజయ సోపానం ► ‘సాక్షి’తో మాజీ అంతర్జాతీయ అంపైర్ పార్థసారథి విశాఖ సిటీ డెస్క్: కనీస వసతులు లేని కాలంలో.. క్రికెట్ అంటే కేవలం పెద్ద నగరాలకు పరిమితమయ్యే తరుణంలో.. అంతర్జాతీయ మ్యాచ్‌లు అంటేనే అబ్బురపడే సమయంలో.. ఇరవై ఏడేళ్ల కిందట ఓ వన్డే మ్యాచ్‌ను విశాఖకు తీసుకు రావాలంటే.. అందుకు ఎంత శ్రమించాలి! ఎంత దీక్షతో పని చేయాలి! క్రికెట్ అంటే ప్రాణం పెట్టే కొందరు వ్యక్తులు అంత తాపత్రయపడ్డారు కాబట్టే అంతర్జాతీయ మ్యాచ్‌ల వేదికగా విశాఖ స్థానం స్థిరపడింది. అలా శ్రమపడ్డ వాళ్లలో కీలకంగా నిలుస్తారు జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) కార్యదర్శి కె.పార్థసారథి. అంతే కాదు.. ఓ నిర్వాహకుడిగా మాత్రమే కాక, ఓ అంతర్జాతీయ అంపైర్‌గా ఆయన విశాఖకు చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చారు. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇప్పటికీ విశాఖ క్రికెట్‌కు దిశానిర్దేశం చేయడంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆటంటే అవధుల్లేని ఇష్టం ఉన్న ఆయన ఇప్పటి ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన వివిధ అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు. సాక్షి: పదకొండో ప్రపంచకప్ ప్రత్యేకతలేమిటి? పార్థసారథి: చాలా రోజులకు మళ్లీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. నలభై అయిదు రోజులపాటు క్రికెట్ అభిమానులకు ఇక పండగే పండగ. అక్కడి బౌన్సీ పిచ్‌లు దృష్టిలో పెట్టుకుంటే పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బౌలింగ్ బలం ఉన్న జట్లకు ఇది అపూర్వ అవకాశం. ఇక భారత్ విషయానికి వస్తే దాదాపు పూర్తిగా కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగుతున్న జట్టు ఇది. యువరాజ్ సింగ్, గంభీర్ వంటి సత్తా ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టి రాయుడు, బిన్నీ వంటి ఫ్రెషర్స్ మీద ఆశలు పెట్టుకుని ధోనీ సేన ప్రపంచకప్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సాక్షి: ఎవరెవరి అవకాశాలు ఎలా ఉంటాయి? పార్థసారథి: ఇక స్వదేశం కాబట్టి సహజంగానే ఆస్ట్రేలియాకు అవకాశాలు బాగుంటాయి. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్ కచ్చితంగా ముందంజ వేస్తుందనిపిస్తోంది. నా లెక్క ప్రకారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్‌కు చేరవచ్చు. ఈ జట్లలో ఆ రోజు ఎవరికి కలిసివస్తే ఆ జట్టు క్లిక్ అయిందన్నమాటే. బౌలింగ్‌లో రాణిస్తేనే భారత్ ముందంజ వేస్తుందన్నది స్పష్టం. సాక్షి: ఈసారి వాతావరణం ఎలా ఉందంటారు? పార్థసారథి: నిజం చెప్పాలంటే 2011 నాటి హైప్ ఈసారి లేదని చెప్పాలి. అప్పుడు భారత్‌లో జరగడం వల్ల ఆ ఉత్సాహం ఉందని కాదు.. ప్రపంచమంతా ఆ టోర్నీని ఎంతో ఆసక్తిగా గమనించింది. ఈసారి అంత ఉత్సాహం కనిపించడం లేదు. సాక్షి: టీ20 ప్రభావం కారణమంటారా? పార్థసారథి: కొంతవరకు కావచ్చు. ఇప్పటి మార్పులతో క్రికెట్లో మునుపటి థ్రిల్ తగ్గుతోందన్నది నా అభిప్రాయం. సాక్షి: గత ప్రపంచకప్ టోర్నీలతో పోలిస్తే ఈసారి ఆట తీరెలా ఉందంటారు? పార్థసారథి: ఇప్పటి క్రికెట్లో స్థాయి తగ్గిందన్నదే నా వ్యాఖ్య. ఒకప్పుడు ఆటలో వైవిధ్యం ఉండేది. ఇంత రక్షణ ఉపకరణాలు (ప్రొటెక్టివ్ గేర్) లేకుండా భయపెట్టే ఫాస్ట్‌బౌలింగ్‌ను అప్పటి ఆటగాళ్లు ఎదుర్కొనే వారంటే వాళ్ల సత్తా అర్ధమవుతుంది. ఇప్పుడా పరిస్థితి లేదు కదా. టెక్నిక్ విషయంలోనూ అప్పటి ఆటగాళ్లే అగ్రగాములని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రారంభం నుంచి భారీ షాట్లే ప్రధానంగా ఆట సాగుతోంది. బౌలింగ్‌లో అంత డెప్త్ కనిపించడం లేదు. స్పిన్ పరిస్థితి చూస్తేనే అది అర్ధమవుతుంది. సాక్షి: ఆట మీద దీని ప్రభావం ఉంటుందా? పార్థసారథి: టెస్ట్‌లలో సైతం ఆ పరిస్థితి కనిపిస్తోంది కదా. అయిదు రోజుల టెస్ట్‌లు నాలుగు రోజుల్లో ముగిసిపోతున్నాయంటే క్వాలిటీ ఎలా ఉందో చెప్పవచ్చు. ఫీల్డింగ్ మెరుగుపడ్డ విషయం వాస్తవమే కానీ, ఇప్పటి వాళ్ల కన్నా సోల్కర్, వెంకట్రాఘవన్ వంటి వాళ్లు ఎక్కువ సాహసంతో ఫీల్డింగ్ చేసే వాళ్లనుకుంటాను. సాక్షి: మీరు స్వదేశంలో, విదేశాల్లో అంపైరింగ్ చేశారు. 1996లో వరల్డ్‌కప్ టోర్నీలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. అప్పటికి ఇప్పటికి అంపైరింగ్ స్థాయి ఎలా ఉందంటారు? పార్థసారథి: అంపైరింగ్ స్థాయి బాగా మెరుగుపడింది. ఇది సాంకేతిక అభివృద్ధి వల్ల కలిగిన మార్పు కాదు. అంపైర్లు తమ స్థాయిని మెరుగు పర్చుకునేలా బీసీసీఐ చేపట్టిన చర్యల కారణంగా ఈ మార్పు కనిపిస్తోంది. సాంకేతికంగా మార్పులు మంచివే కావీ ఎప్పుడైనా అంపైర్ తనంత తానుగా తీసుకునే నిర్ణయాలను గౌరవించడమన్నదే మంచిదని నా అభిప్రాయం. మైదానం మీద ఉన్న అంపైర్ నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వడమే మంచిదన్నది నా ఉద్దేశం. కెమెరా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు కూడా పూర్తిగా కచ్చితమని చెప్పడం కష్టం కదా.. సాక్షి: వివాదాస్పదమైన డీఆర్ఎస్ (డెసిషన్ రిఫరల్ సిస్టమ్) గురించి? పార్థసారథి: అంపైర్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటే మంచిది. ఇంకా దాని మీద అపీల్ ఏ మేరకు సబబో? బీసీసీఐ ఈ విషయంలో మొగ్గు చూపడం లేదు కానీ ఐసీసీ నిర్ణయం కాబట్టి తలవొగ్గక తప్పేట్టు లేదు. ఆటలో మార్పులు అనివార్యం కదా.. తప్పదు మరి.