
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి తమ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు దూరమైన సదీర సమరవిక్రమ, కరుణరత్నే వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా కప్ 2023లో భారత్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరిరిచిన స్పిన్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగేకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
అయితే వన్డే సిరీస్‌కు సీనియర్ ఆల్‌రౌండర్లు దసున్ షనక, మథ్యూస్‌కు మాత్రం సెలక్టర్లు చోటివ్వలేదు. అదేవిధంగా టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ల దుష్మాంత చమీరా, నువాన్ తుషారా ఇప్పుడు వన్డేలకు కూడా దూరమయ్యారు. ఇక ఆగస్టు 2న కొలంబో వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, అసిత ఫెర్నాండో
Comments
Please login to add a commentAdd a comment