వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఇవాళ గ్రూప్-బి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బులవాయో వేదికగా జరిగిన ఇవాల్టి తొలి మ్యాచ్‌లో యూఏఈ జట్టు శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి యూఏఈ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్లంతా (నిస్సంక (57), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (73)) హాఫ్ సెంచరీలు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు చరిత్ అసలంక (23 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ఆఖర్లో హసరంగ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) కూడా ఓ చేయి వేయడంతో శ్రీలంక ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షనక (1), ధనంజయ డిసిల్వ (5) మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమయ్యారు.
యూఏఈ బౌలర్లలో అలీ నసీర్ 2 వికెట్లు పడగొట్టగా.. రోహన్ ముస్తఫా, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో 2 బెర్తుల కోసం విండీస్, శ్రీలంక, జింబాబ్వే సహా మొత్తం 10 జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విన్నర్, రన్నరప్‌లు భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్‌లతో వన్డే వరల్డ్‌కప్-2023లో పోటీపడతాయి.
గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్, వెస్టిండీస్, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment