ఆసియా కప్ చరిత్రలో పదకొండోసారి ఫైనల్ చేరిన శ్రీలంక (PC: SLC)
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్‌కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు.
టీమిండియాతో మ్యాచ్‌లో తప్పిదాలు
బ్యాటింగ్‌కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్‌లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు.
అదరగొట్టిన కుశాల్, సదీర
ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్‌తో లంక గెలుపునకు బాటలు వేశారు.
అసలంక ఆదుకున్నాడు
అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్‌లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్‌కు చేరింది.
గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో
ఇక ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్‌లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది.
చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్
మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023
Comments
Please login to add a commentAdd a comment