
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు లంక స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక మోకాలి గాయంతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో అవిష్క ఫెర్నాండోను సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా ఈ సిరీస్‌లో శ్రీలంక కెప్టెన్‌గా వనిందు హసరంగా ఎంపికైనప్పటికీ తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఐసీసీ స్పెన్షన్ కారణంగా అతడు తొలి రెండు మ్యాచ్‌లకు దూరం ఉండనున్నాడు.
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఆఖరి టీ20లో అంపైర్‌పై బహిరంగంగా విమర్శించి నందున అతడు రెండు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంగ్లా సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు లంక కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ దృవీకరించింది. మార్చి 4న సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతం బంగ్లా పర్యటనలో లంక మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
శ్రీలంక జట్టు: వనిందు హసరంగా , చరిత్ అసలంక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, మహేశ్ తీక్షణ, అకిలా దనంజయ, మథీషా పతిరానా, నువాన్ తుషారా, బినారో ఫెర్నాండో, వాండర్సే, దిల్షాన్ మధుశంక
చదవండి: BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల క్రికెటర్లు నలుగురు.. రింకూ, తిలక్ ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment