టీమిండియాతో సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయపడ్డాడు. ఈ క్రమంలో భారత్‌తో టీ20 సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. శ్రీలంక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్ టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
సిరీస్ మొత్తానికీ
మరోవైపు.. మంగళవారం తమ జట్టును ప్రకటించిన శ్రీలంక క్రికెట్‌కు చమీర గాయం రూపంలో షాక్ తగిలింది. చరిత్ అసలంక కెప్టెన్సీలోని జట్టులో భాగమైన దుష్మంత చమీర టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే, అనుభవజ్ఞుడైన ఈ రైటార్మ్ పేసర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్నది శ్రీలంక బోర్డు ఇంతవరకు ప్రకటించలేదు.
గాయాల బెడద
గత రెండేళ్లుగా దుష్మంత చమీర తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా చివరగా శ్రీలంక జట్టుకు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి స్థానం ఇచ్చినప్పటికీ.. తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు.
అయితే, లంక ప్రీమియర్ లీగ్‌తో రీఎంట్రీ ఇచ్చిన చమీర క్యాండీ ఫాల్కన్స్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడాడు. తన చివరి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక 32 ఏళ్ల దుష్మంత చమీర ఇప్పటి వరకు 55 అంతర్జాతీయ టీ20లు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక ప్రకటించిన జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార, బినురా ఫెర్నాండో.
Comments
Please login to add a commentAdd a comment