Dushmantha Chameera
-
Ind vs SL: టీ20 సిరీస్ నుంచి లంక పేసర్ అవుట్!
టీమిండియాతో సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయపడ్డాడు. ఈ క్రమంలో భారత్‌తో టీ20 సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. శ్రీలంక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్ టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది.సిరీస్ మొత్తానికీమరోవైపు.. మంగళవారం తమ జట్టును ప్రకటించిన శ్రీలంక క్రికెట్‌కు చమీర గాయం రూపంలో షాక్ తగిలింది. చరిత్ అసలంక కెప్టెన్సీలోని జట్టులో భాగమైన దుష్మంత చమీర టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే, అనుభవజ్ఞుడైన ఈ రైటార్మ్ పేసర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్నది శ్రీలంక బోర్డు ఇంతవరకు ప్రకటించలేదు.గాయాల బెడదగత రెండేళ్లుగా దుష్మంత చమీర తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా చివరగా శ్రీలంక జట్టుకు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి స్థానం ఇచ్చినప్పటికీ.. తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు.అయితే, లంక ప్రీమియర్ లీగ్‌తో రీఎంట్రీ ఇచ్చిన చమీర క్యాండీ ఫాల్కన్స్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడాడు. తన చివరి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక 32 ఏళ్ల దుష్మంత చమీర ఇప్పటి వరకు 55 అంతర్జాతీయ టీ20లు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక ప్రకటించిన జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార, బినురా ఫెర్నాండో. -
రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ!
రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. కెప్టెన్‌గా తీసుకున్న స్టీవ్ స్మిత్ బాల్ ట్యాపంరింగ్ వివాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టుకు కీలకంగా ఉపయోగపడతాడని భావించిన శ్రీలంక పేస్ బౌలర్ దుశ్మంత చమీరా కూడా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 26 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ గాయంతో బాధపడుతున్నాడు. అతడు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేది లేనిది తేలుస్తామని వైద్యులు తేల్చారు. దీంతో ఐపీఎల్‌తోపాటు శ్రీలంక జట్టు చేపట్టబోయే వెస్టిండీస్ పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. చమీరాను రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ వేలంలో రూ. 50లక్షలకు కొనుగోలు చేసింది. అతడు జట్టుకు దూరం కావడం నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బెన్ స్టోక్స్, జొఫ్రా ఆర్చర్, బెన్ లాఫ్లిన్ తదితర విదేశీ ఆటగాళ్లతో రాజస్థాన్ జట్టు సర్దుకుపోవాల్సి ఉంటుంది. -
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ!
లండన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక ప్రధాన పేసర్ దుష్మంతా చమీరా గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. చమీరా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టూర్ నుంచి వైదొలిగినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. చమీరా వెన్నుముకలో చిన్నపాటి పగులు రావడంతో అతనికి సుదీర్ఘ విశ్రాంతి కానుంది. దాదాపు నాలుగు నెలలు పాటు ఇంటికే పరిమితం కానున్నాడు చమీరా. శ్రీలంక ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో ఓటమి పాలైన తొలి మ్యాచ్ లో చమీరా మూడు వికెట్లు తీసి మోస్తరుగా ఫర్వాలేదనించాడు. ఇదిలా ఉండగా అంతకుముందు సీమర్ ధర్మికా ప్రసాద్ భుజం నొప్పి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు.