రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. కెప్టెన్‌గా తీసుకున్న స్టీవ్ స్మిత్ బాల్ ట్యాపంరింగ్ వివాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టుకు కీలకంగా ఉపయోగపడతాడని భావించిన శ్రీలంక పేస్ బౌలర్ దుశ్మంత చమీరా కూడా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 26 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ గాయంతో బాధపడుతున్నాడు. అతడు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేది లేనిది తేలుస్తామని వైద్యులు తేల్చారు. దీంతో ఐపీఎల్‌తోపాటు శ్రీలంక జట్టు చేపట్టబోయే వెస్టిండీస్ పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
చమీరాను రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ వేలంలో రూ. 50లక్షలకు కొనుగోలు చేసింది. అతడు జట్టుకు దూరం కావడం నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బెన్ స్టోక్స్, జొఫ్రా ఆర్చర్, బెన్ లాఫ్లిన్ తదితర విదేశీ ఆటగాళ్లతో రాజస్థాన్ జట్టు సర్దుకుపోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment