రస్సెల్, దినేశ్ కార్తీక్
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాపార్డర్ విఫలమైనా..దినేశ్ కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు రస్సెల్, శుబ్‌మన్‌గిల్‌లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కోల్‌కతాకు ఆదిలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతినే బౌండరీకి తరలించిన ఓపెనర్ సునీల్ నరైన్ మరుసటి బంతికే స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప(3), నితీష్ రాణాలు(3) తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ మరో ఓపెనర్ క్రిస్‌లిన్‌తో బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకుంటుండనుకున్న లిన్(18)ను శ్రేయస్ గోపాల్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో కోల్‌కతా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్..
క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆచితూచి ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతు వికెట్‌ను కాపాడారు. అయితే జట్టు స్కోర్ 106 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ 28(17 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్)ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చి రస్సెల్‌తో కార్తీక్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలో కార్తీక్ 35 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించిన కార్తీక్ 52(38 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
చివర్లో రస్సెల్ మెరుపులు
ఓ దశలో సాధారణ లక్ష్యాన్ని అయినా నిర్ధేశిస్తుందా అనుకున్న కోల్‌కతా .. రస్సెల్ 5 సిక్సులతో చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో రస్సెల్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, లాఫ్లిన్‌లు రెండేసి వికెట్లు తీయగా.. గోపాల్ ఓ వికెట్ పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment