
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.. అదేంటి ఐపీఎల్ సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే రసెల్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడా అనే అనుమానం వచ్చిందా. అయితే రసెల్ ఈ విధ్వంసం సృష్టించింది ప్రాక్టీస్ మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం కేకేఆర్ జట్టు ఇంట్రా స్క్వాడ్ టీమ్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. ఒక జట్టుకు బెన్ కటింగ్ సారధ్యం వహించగా.. మరొక దానికి మోర్గాన్ నాయకత్వం వహించాడు.
ఇన్నింగ్స్ మధ్యలో రసెల్ కొన్ని భారీ షాట్లతో అలరించాడు. ఈ నేపథ్యంలో రసెల్ కొట్టిన ఒక షాట్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తిక్ వైపు దూసుకెళ్లింది. అయితే కార్తిక్ మెరుపువేగంతో స్పందించి మొకాళ్ల మీద కిందకు వంగడంతో రెప్పపాటులో బంతి అతని పై నుంచి వెళ్లిపోయింది. రసెల్ కొట్టిన పవర్‌పుల్ షాట్ ఒకవేళ కార్తిక్ తగిలిఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. దీనికి సంబంధించిన వీడియోనూ కేకేఆర్ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు. ''రసెల్ పవర్‌హిట్టింగ్ నుంచి కార్తిక్ తప్పించుకున్నాడు.. ఆ బంతి కార్తిక్ తగిలిఉంటే ఏమై ఉండేదో.. రెప్పపాటులో తప్పించుకున్నాడు..'' అంటూ కామెంట్స్ జత చేశారు. కాగా కేకేఆర్ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. కాగా కేకేఆర్ జట్టులో నితీష్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో కేకేఆర్ శిబిరంలోనూ కలవరం మొదలైంది.
చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి కరోనా
'మేం సీఎస్‌కేకు ఆడలేం'.. కారణం అదేనట
Andre 🤯
— KolkataKnightRiders (@KKRiders) April 3, 2021
DK 😅
Watch the Knights get competitive in a practice game LIVE from DY Patil Stadium now 👇🤩@Russell12A @DineshKarthik #KKRHaiTaiyaar #IPL2021