IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్‌ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా | IPL 2021 Final: Dinesh Karthik Speaking In Telugu With Harsha Bhogle Gone Viral | Sakshi
Sakshi News home page

IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్‌ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా

Published Fri, Oct 15 2021 10:24 PM | Last Updated on Sun, Oct 17 2021 3:32 PM

IPL 2021 Final: Dinesh Karthik Speaking In Telugu With Harsha Bhogle Gone Viral - Sakshi

Dinesh Karthik Speaking Telugu In IPL 2021 Final: 2021 ఐపీఎల్‌ ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్‌కీపర్‌ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు.

మెగా ఫైనల్‌ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌నూ పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌ అంటే సహజంగా ఎవరికైన కాస్తో కూస్తో ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని, ఫైనల్‌కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని అన్నాడు. ఈ సందర్భంగా డీకే.. కేకేఆర్‌ ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్‌మీడియాలో వీడియోని షేర్‌ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్‌ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 
చదవండి: IPL 2021 Final: ఐపీఎల్‌ చరిత్రలో అద్భుత రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement