Photo Courtesy: BCCI/IPL
అహ్మదాబాద్: తన కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు తగిలిన ఎదురుదెబ్బలను వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రసెల్.. చీకటి రోజుల్ని మరొకసారి నెమరవేసుకున్నాడు. తనను ప్రజలు డ్రగ్స్ తీసుకున్నానని ప్రశ్నించడం ఎప్పటికీ చేదు జ్ఞాపకమేనన్నాడు. తన కెరీర్ మంచి స్టేజ్‌లో ఉన్న 2017లో డ్రగ్స్ ఆరోపణలు రావడంతో నిషేధానికి గురైన విషయాన్ని తలచుకున్నాడు. కేకేఆర్ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు.
‘నా కెరీర్‌లో 2017 ఒక చెత్త ఏడాది. నేను క్రికెట్‌లో టాప్ గేర్‌లో ఉన్నప్పుడు నిషేధానికి గురయ్యా. నేను బంతిని హిట్ చేస్తే అది క్లీన్‌హిట్ అయ్యేది. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు. నేను ఏదీ దాచాలను కోవడం లేదు. నేను టెస్టులు చేయించుకున్న తర్వాత క్రికెట్ ఆడేవాడిని. నేను 100 మీటర్ల దాటి సిక్స్ కొట్టగలను. షార్ట్ రన్ తీసుకునే 140 కి.మీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. అటువంటిది నేను డ్రగ్స్ తీసుకున్నాని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ నేను చూపించుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎలా బయటపడాలో తెలుసు. రెండేళ్ల పాటు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగాయి.
ఆ సమయంలో నన్ను గట్టిగా కొట్టారు. ఇది నన్ను బాధించింది. ఇది దుష్ట ప్రపంచం. మనల్ని ఏదో రకంగా నాశనం చేయాలనే చూస్తారు. అప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చిన బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పాను.. నేను ఏ తప్పు చేయలేదని బైబిల్‌పై ప్రమాణం చేశా. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరూ కూడా బైబిల్‌పై ప్రమాణం చేసి అబద్ధం చెప్పరు. నాకు బైబిల్ అంటే చాలా గౌరవం’ అని రసెల్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇక్కడ చదవండి: వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు
మ్యాక్స్‌వెల్ ఇలా జరిగిందేంటి?
Comments
Please login to add a commentAdd a comment