అజింక్యా రహానే, దినేశ్ కార్తీక్
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ సారథి అజింక్యా రహానే ఈ మైదానం ఛేజింగ్‌కు కలిసొస్తుండటంతో ఫీల్డింగ్‌కే మొగ్గు చూపాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన సన్‌రైజర్స్‌తో ఇదే వేదికగా తలపడనుంది.
నైట్‌రైడర్సే ఫేవరెట్..
బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో కార్తీక్ సేన సమతుల్యంగా ఉంది. పైగా ఇంటాబయటా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌ను సునాయాసంగానే ఓడించింది. ఇక సొంతగడ్డపై మ్యాచ్ జరగుతుండటం కోల్‌కతాకు బాగా కలిసి రానుంది. మరోసారి ఓపెనింగ్‌లో నరైన్, లిన్ శుభారంభానిస్తే కోల్‌కతా భారీ స్కోర్ చేయగలుగుతోంది. రస్సెల్ వీరవిహారం జట్టుకు మిసైల్ బలం కానుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో అతను సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వైనం అద్భుతం. బ్యాటింగ్‌లో వీరితో పాటు రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్‌లు, బౌలింగ్‌లో సియర్లెస్, ప్రసిధ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చావ్లాలు రాణిస్తే కోల్‌కతా తిరుగుండదు.
నిలకడలేమితో రాయల్స్..
రాయల్స్ నిలకడలేమితో సతమతమవుతోంది. బట్లర్ వీరోచిత విన్యాసంతో నెగ్గుకొచ్చిన ఈ జట్టుకు అతను స్వదేశం చేరడం పెద్ద లోటు. శామ్సన్ ఒకటి అర మినహా సీజన్ అంతా అకట్టుకోలేకపోయాడు. భారీ లక్ష్యాలను ఛేదించే సత్తా ఇప్పటికి రాయల్స్ జట్టుకు లేదనే చెప్పాలి. కానీ రహానే చేజింగ్‌కు మొగ్గు చూపడం విశేషం. ప్రస్తుతం నైట్‌రైడర్స్‌ను గెలవాలంటే తప్పకుండా జట్టంతా కలిసి సర్వశక్తులు ఒడ్డాల్సిందే. రహానే, షార్ట్, త్రిపాఠి సమష్టిగా రాణిస్తేనే ప్రత్యర్థి ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేధించగలదు. బౌలింగ్‌లో ఆర్చర్ వైవిధ్యం జట్టుకు కలిసివస్తోంది. శ్రేయస్ గోపాల్ గత మ్యాచ్‌లో బెంగళూరు భరతం పట్టాడు. అలాంటి ప్రదర్శనే ఇక్కడా పునరావృతం కావాలని రాజస్తాన్ ఆశిస్తోంది.
తుదిజట్లు
కోల్‌కతానైట్ రైడర్స్: దినేశ్ కార్తీక్ (కెప్టెన్), సునీల్ నరైన్, క్రిస్‌లిన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రాణా,శుభ్‌మన్ గిల్, ఆండ్రూ రస్సెల్, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా, ప్రసిద్ కృష్ణ, జావోన్ సీర్లెస్
రాజస్తాన్ రాయల్స్ : అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, కృష్ణప్ప గౌతమ్, హెన్రిచ్ క్లాసన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, స్టువర్ట్ బిన్నీ, ఇష్ సోధి, జయదేవ్ ఉనద్కత్, బెన్ లాఫ్లిన్
Comments
Please login to add a commentAdd a comment