శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ! | Sri Lanka pacer Chameera injured, to miss England tour | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ!

Published Tue, May 24 2016 7:01 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Sri Lanka pacer Chameera injured, to miss England tour

లండన్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక ప్రధాన పేసర్ దుష్మంతా చమీరా గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. చమీరా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టూర్ నుంచి వైదొలిగినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. చమీరా వెన్నుముకలో చిన్నపాటి పగులు రావడంతో అతనికి సుదీర్ఘ విశ్రాంతి కానుంది. దాదాపు నాలుగు నెలలు పాటు ఇంటికే పరిమితం కానున్నాడు చమీరా. 

 

శ్రీలంక ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో ఓటమి పాలైన తొలి మ్యాచ్ లో చమీరా మూడు వికెట్లు తీసి మోస్తరుగా ఫర్వాలేదనించాడు. ఇదిలా ఉండగా అంతకుముందు సీమర్ ధర్మికా ప్రసాద్ భుజం నొప్పి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement