త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జులై 23) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో ఘోర ప్రదర్శన (తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ) అనంతరం వనిందు హసరంగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
సీనియర్లు ధనంజయ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. మరో ఇద్దరు సీనియర్లు దినేశ్ చండీమల్, కుశాల్ జనిత్ పెరీరా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన అవిష్క ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. సదీర సమరవిక్రమ, దిల్షన్ మధుషంకలను పక్కకు పెట్టారు సెలెక్టర్లు.
కాగా, శ్రీలంకతో టీ20 సిరీస్ ఈనెల 27 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక గడ్డపై అడుగుపెట్టింది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే మొదటి పరీక్ష. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.
భారత్‌తో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో
Comments
Please login to add a commentAdd a comment