ఒక సిరీస్ గెలిచిన తర్వాత ఆటగ్లాళ్లు గ్రౌండ్‌లోనే సెలబ్రేషన్స్ చేసుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా బైక్‌పై తమ విజయోత్సావాన్ని జరుపుకునే క్రమంలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ కిందపడ్డాడు. బైక్‌పై చక్కర్లు కొడుతుండగా అది కాస్తా అదుపు తప్పడంతో మెండిస్ పడిపోయాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తోజరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంకేయులు 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. తొలి వన్డేలో 91 పరుగుల తేడాతో విజయం సాధించిన శ్రీలంక, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.