ఆసియా కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. పథుమ్ నిస్సంక (40 బంతుల్లో 41; 6 ఫోర్లు), అసలంక (43 బంతుల్లో 36; 2 ఫోర్లు, సిక్స్), దునిత్ వెల్లెలెగె (39 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కరుణరత్నే (35 బంతుల్లో 32; 6 ఫోర్లు), తీక్షణ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.
లంక ఇన్నింగ్స్‌లో సమరవిక్రమ (3), కెప్టెన్ షనక (5) మాత్రమే విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 2.2 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోయి 10 పరుగులు చేసింది. కసున్ రజిత బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి రహానుల్లా గుర్భాజ్ (4) ఔటయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ (6), గుల్బదిన్ నైబ్ క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి సూపర్-4కు చేరుకుంటుంది. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, భారత్‌లు సూపర్-4కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment