
గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్‌ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని మెండిస్ కవర్ ఆడే ప్రమత్నం చేయగా.. బంతి ఇన్‌స్వింగ్ అయ్యి వికెట్లను వికెట్లను గిరాటేసింది.
దీంతో ఒక్క సారిగా మెండిస్ కూడా బిత్తరి పోయాడు. సిరాజ్ దెబ్బకు మెండిస్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు అదిలోనే సిరాజ్ గట్టి షాకిచ్చాడు.
లంక ఓపెనర్ల ఇద్దరని సిరాజ్ తొలి ఐదు ఓవర్లలోనే పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఉమ్రాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసే సరికి లంక 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
Mohammed Siraj is breathing fire 🔥 pic.twitter.com/ykjPbSSINE
— Emon Mukherjee (@EmonMukherjee21) January 10, 2023
చదవండి: IND vs SL: సచిన్‌తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు