CWC 2023- NZ vs SL Updates:
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 171 పరగులకు ఆలౌట్ అయింది.
కివీస్‌తో మ్యాచ్.. కష్టాల్లో శ్రీలంక జట్టు
32.1: రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి చమీర అవుట్(1). 33 ఓవర్లలో లంక స్కోరు: 132-9
► 25 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు: 114-8
ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
23.3: ఫెర్గూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నె అవుట్(6). లంక స్కోరు: 113/8 (23.3)
19 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 105-7
►18.3: సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ధనంజయ(19)
►16.4: సాంట్నర్ బౌలింగ్‌లో మథ్యూస్(16) అవుట్.. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
పవర్ ప్లేలో అతడొక్కడే
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక రెండు పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 6 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
మరో ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధ శతకం(51) సాధించగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన సమర విక్రమ 1, చరిత్ అసలంక 8, పరుగులు మాత్రమే చేశారు. దీంతో పవర్‌ప్లే(10 ఓవర్లు) ముగిసే సరికి లంక కేవలం 74 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (నవంబర్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ కివీస్ తుది జట్టులోకి రాగా.. కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే లంక ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక
Comments
Please login to add a commentAdd a comment