
మెండిస్ కీలక ఇన్నింగ్స్
కొలంబో:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక ఫస్ట్ డౌన్ ఆటగాడు కుశాల్ మెండిస్ సెంచరీతో మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంకకు మెండిస్ కీలక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ప్రధానంగా లంకేయులు కష్టాల్లో పడ్డ సమయంలో మెండిస్ శతకంతో ఆదుకున్నాడు. 120 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు.
మరొకవైపు ఓపెనర్ కరుణ రత్నేతో కలిసి 170 పరుగులకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ జోడి దాదాపు 50.0 ఓవర్ల పాటు క్రీజ్ లో నిలబడి లంక ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది.తొలి ఇన్నింగ్స్ లో లంక జట్టు 183 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు 439 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అదే సమయంలో లంక జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. లంక జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మరికొన్ని కీలక భాగస్వామ్యాలు అవసరం.