పాట్‌ కమిన్స్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | Pat Cummins Named As Wisden's Leading Cricketer Of The Year 2023 | Sakshi
Sakshi News home page

పాట్‌ కమిన్స్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Published Tue, Apr 16 2024 12:29 PM | Last Updated on Tue, Apr 16 2024 12:36 PM

Pat Cummins Named As Wisden Leading Cricketer Of The Year 2023 - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను విజ్డెన్‌ ఈ అవార్డుకు పాట్‌ను ఎంపిక చేసింది. గతేడాది వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు గాను పాట్‌ను ఈ అవార్డు వరించింది. 

కమిన్స్‌ 2023లో కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌కప్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, యాషెస్‌ సిరీస్‌లను గెలిచాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును సైతం దక్కించుకున్న కమిన్స్‌.. వ్యక్తిగత ప్రదర్శనల కారణంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌, ఇంగ్లండ్‌తో బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ తదితర అవార్డులు అందుకున్నాడు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీని కూడా విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కమిన్స్‌.. ఈ సీజన్‌ వేలంలో 20.5 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. 

విజ్డెన్‌.. కమిన్స్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ స్టార్క్‌, ఆష్లే గార్డ్‌నర్ (ఆసీస్‌ మహిళా క్రికెటర్‌), హ్యారీ బ్రూక్‌, మార్క్‌ వుడ్‌  లాంటి అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించింది.

2015 నుంచి విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు దక్కించుకున్నవారు..

  • 2015లో కేన్‌ విలియమ్సన్‌
  • 2016లో విరాట్‌ కోహ్లి
  • 2017లో విరాట్‌ కోహ్లి
  • 2018లో విరాట్‌ కోహ్లి
  • 2019లో బెన్‌ స్టోక్స్‌
  • 2020లో బెన్‌ స్టోక్స్‌
  • 2021లో జో రూట్‌
  • 2022లో బెన్‌ స్టోక్స్‌
  • 2023లో పాట్‌ కమిన్స్‌
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement