Wisden Cricketer of the Year Award
-
విజ్డెన్ అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు.. కోహ్లికి నో ప్లేస్
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా విజ్డెన్ ఎంపిక చేసిన అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా విజ్డెన్ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం విశేషం. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.వికెట్‌కీపర్ కోటాలో పాక్ ఆటగాడు, ఐసీసీ పదో ర్యాంకర్ మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మతో (ఆరో ర్యాంక్) పాటు ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ (నాలుగో ర్యాంక్) ఎంపికయ్యాడు.Wisden picks Current Best Test XI based on ICC Rankings:1. Rohit Sharma.2. Steve Smith.3. Kane Williamson.4. Joe Root.5. Daryl Mitchell.6. Mohammad Rizwan.7. Ravindra Jadeja.8. Ravi Ashwin.9. Pat Cummins.10. Jasprit Bumrah.11. Josh Hazelwood. pic.twitter.com/xUSQPYjA09— Tanuj Singh (@ImTanujSingh) September 10, 2024వన్ డౌన్లో కేన్ విలియమ్సన్ (రెండో ర్యాంక్), నాలుగో స్థానంలో జో రూట్ (మొదటి ర్యాంక్), ఐదో ప్లేస్‌లో డారిల్ మిచెల్ (మూడో ర్యాంక్), వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్ (పదో ర్యాంక్), ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా (నంబర్ వన్ ఆల్‌రౌండర్), స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (నంబర్ వన్ టెస్ట్ బౌలర్), పేసర్లుగా పాట్ కమిన్స్ (నాలుగో ర్యాంక్), జస్ప్రీత్ బుమ్రా (రెండో ర్యాంక్), జోష్ హాజిల్‌వుడ్ (రెండో ర్యాంక్) విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఓవరాల్‌గా చూస్తే విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు, ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్లు, ఇంగ్లండ్, పాక్‌ల నుంచి చెరొకరు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు ఎంపిక కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగానే జరిగింది. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆటగాళ్లను విజ్డెన్ తమ అత్యుత్తమ జట్టుకు ఎంపిక చేసుకుంది. -
పాట్ కమిన్స్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను విజ్డెన్ ఈ అవార్డుకు పాట్‌ను ఎంపిక చేసింది. గతేడాది వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు గాను పాట్‌ను ఈ అవార్డు వరించింది. కమిన్స్ 2023లో కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్‌లను గెలిచాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం దక్కించుకున్న కమిన్స్.. వ్యక్తిగత ప్రదర్శనల కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్, ఇంగ్లండ్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తదితర అవార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని కూడా విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కమిన్స్.. ఈ సీజన్ వేలంలో 20.5 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. విజ్డెన్.. కమిన్స్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ స్టార్క్, ఆష్లే గార్డ్నర్ (ఆసీస్ మహిళా క్రికెటర్), హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్ లాంటి అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించింది. 2015 నుంచి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నవారు.. 2015లో కేన్ విలియమ్సన్ 2016లో విరాట్ కోహ్లి 2017లో విరాట్ కోహ్లి 2018లో విరాట్ కోహ్లి 2019లో బెన్ స్టోక్స్ 2020లో బెన్ స్టోక్స్ 2021లో జో రూట్ 2022లో బెన్ స్టోక్స్ 2023లో పాట్ కమిన్స్ -
డబ్ల్యూటీసీ 2021-23 అత్యుత్తమ జట్టు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సెకెండ్ సైకిల్ (2021-23)కు సంబంధించి ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ విజ్డెన్.కామ్ తమ అత్యుత్తమ జట్టును ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. డబ్ల్యూటీసీ సీజన్-2 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో విజ్డెన్ తమ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ వివరాలను మీడియాతో షేర్ చేసుకుంది. ఈ జాబితాలో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఒక్కొకరికి విజ్డెన్ చోటు కల్పించింది. డబ్ల్యూటీసీ సీజన్-2లో ప్రదర్శన ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు విజ్డెన్ వివరించింది. విజ్డెన్ టీమ్ ఆఫ్ డబ్ల్యూటీసీ 2021-23.. ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా, 16 మ్యాచ్‌ల్లో 69.91 సగటున 6 శతకాలు, 7 హాఫ్‌సెంచరీ సాయంతో 1608 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 195*) దిముత్ కరుణరత్నే (శ్రీలంక, 12 మ్యాచ్‌ల్లో 47.90 సగటున 2 సెంచరీలు, 8 హాఫ్‌సెంచరీల సాయంతో 1054 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 147) మార్నస్ లబూషేన్ (ఆస్ట్రేలియా, 19 మ్యాచ్‌ల్లో 53.89 సగటున 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 1509 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 204) దినేశ్ చండీమాల్ (శ్రీలంక, 10 మ్యాచ్‌ల్లో 68.42 సగటున 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 958 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 206*) జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్, 15 మ్యాచ్‌ల్లో 51.40 సగటున 6 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 1285 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 162) రిషబ్ పంత్ (భారత్, 12 మ్యాచ్‌ల్లో 43.40 సగటున 2 సెంచరీలు, 5 హాఫ్‌సెంచరీల సాయంతో 868 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 146) రవీంద్ర జడేజా (భారత్, 12 మ్యాచ్‌ల్లో 37.38 సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 673 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 175*, అలాగే 5 ఫైఫర్‌ల సాయంతో 43 వికెట్లు, అత్యుత్తమ ప్రదర్శన 7/42) పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా, 15 మ్యాచ్‌ల్లో 21.22 సగటున 53 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 5/38) కగిసో రబాడ (సౌతాఫ్రికా, 13 మ్యాచ్‌ల్లో 26.97 సగటున 67 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 6/50) నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా, 19 మ్యాచ్‌ల్లో 26.97 సగటున 83 వికెట్లు, 5 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 8/64) జస్ప్రీత్ బుమ్రా (భారత్, 10 మ్యాచ్‌ల్లో 19.73 సగటున 45 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 5/24) కాగా, విజ్డెన్ ప్రకటించిన ఈ జాబితాలో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ మాజీ టెస్ట్ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విజ్డెన్ జ్యూరీ శ్రీలంక ఆటగాళ్లకు పెద్ద పీట వేయగా.. న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆటగాళ్లను పూర్తిగా విస్మరించింది. ఇదిలా ఉంటే, జూన్ 7 నుంచి ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. -
ప్రతిష్టాత్మక అవార్డుకు రోహిత్, బుమ్రా ఎంపిక.. కోహ్లికి దక్కని చోటు
లండన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి ప్రతిష్టాత్మక విజ్డన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుకు ఎంపికయ్యారు. విజ్డన్ టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో రోహిత్, బుమ్రాలతో పాటు గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన డేవాన్ కాన్వే (న్యూజిలాండ్), ఓలీ రాబిన్సన్ (ఇంగ్లండ్), డాన్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా మహిళా జట్టు సారధి) చోటు దక్కించుకున్నారు. లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ 2022 ఎడిషన్ అవార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఎగురేసుకుపోయాడు. ఈ వివరాలను విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ వెల్లడించారు. 2021లో ఏకంగా 6 సెంచరీలు (1708 పరుగులు) సాధించినందుకు గాను రూట్‌ను, ఇంగ్లండ్ గడ్డపై (టెస్ట్ సిరీస్) సత్తా చాటినందుకు గాను రోహిత్ శర్మ, బుమ్రాలను ఆయా అవార్డులకు ఎంపిక చేసినట్లు బ్రూత్ పేర్కొన్నాడు. గతేడాది సమ్మర్లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ రెండు టెస్ట్‌లు గెలవడంలో రోహిత్ శర్మ, బుమ్రా కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో వర్షం అంతరాయం కలిగించకుంటే టీమిండియా సునాయసంగా విజయం సాధించి సిరీస్ గెలిచేదని ప్రస్తావించాడు. ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా 4 టెస్ట్‌ల్లో 18 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడని గుర్తు చేశాడు. ఆ సిరీస్ భారత్ సాధించిన రెండు విజయాల్లో రోహిత్‌ది ముఖ్యపాత్ర అని, లార్డ్స్ టెస్ట్‌లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబునిచ్చాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రోహిత్ 4 టెస్ట్‌ల్లో 368 పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచాడని పేర్కొన్నాడు. కాగా, 5 టెస్ట్‌ల ఇంగ్లండ్ పర్యటనలో భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా, కోవిడ్ కారణంగా చివరి టెస్ట్ రద్దైంది. చదవండి: ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం.. స్టార్ స్పోర్ట్స్ లింకును దొంగిలించి..! -
విజ్డన్ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్
లండన్: గత ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019 సంవత్సరానికిగాను ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’గా స్టోక్స్‌ను ఎంపిక చేసినట్లు విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రకటించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక ఇంగ్లండ్ ఆటగాడు దీనికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వరుసగా గత మూడు సంవత్సరాలు లీడింగ్ క్రికెటర్‌గా కోహ్లి ఎంపిక కాగా... ఇప్పుడు స్టోక్స్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్... ఫైనల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే స్టోక్స్ టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సంచలన విజయం అందించాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికైంది. 2016లోనూ ఇదే అవార్డుకు ఎంపికైన పెర్రీ...రెండుసార్లు ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ, అర్ధసెంచరీ చేయడంతో పాటు వన్డేల్లో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగులు సాధించింది. మరో 27 వికెట్లు కూడా పడగొట్టింది. టి20ల్లో వరల్డ్ లీడింగ్ క్రికెటర్ గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రసెల్ ఎంపికయ్యాడు. -
ధోనిని కాదని.. రోహిత్‌కే ఓటు
న్యూఢిల్లీ: ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు, వన్డే అంతర్జాతీయ జట్లను ఇప్పటికే ప్రకటించిన విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్ ... అత్యుత్తమ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టును సైతం ఎంపిక చేసింది. ఈ దశాబ్దపు విజ్డెన్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించింది. లీగ్ నిబంధనల ప్రకారం నలుగురు విదేశీయులు, ఏడుగురు స్వదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించిన విజ్డెన్.. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్ల గురించి తీవ్రంగా చర్చించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా నీరాజనాలందుకున్న ధోని, రోహిత్ శర్మలలో ఎవరికి పగ్గాలు అప్పగించాలన్నదానిపై తర్జనభర్జనలు పడ్డ విజ్డెన్.. చివరికి అత్యధికంగా నాలుగుసార్లు ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపిన రోహిత్‌కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. ధోనిని వికెట్‌కీపర్‌గా జట్టులోకి తీసుకుంది. దశాబ్దపు విజ్డెన్ ఐపీఎల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), క్రిస్ గేల్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, మలింగ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా -
బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం
టీమిండియా స్పీడస్టర్ జస్ప్రిత్ బుమ్రా , బ్యాట్స్‌వుమన్ స్మృతి మంధాన ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురికి ఈ పురస్కారం లభించగా అందులో ఇద్దరు భారతీయులు ఉండడం విశేషం. మిగతవారిలో ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), దిముత్ కరుణరత్నే (శ్రీలంక), రషీద్ ఖాన్(అప్ఘనిస్తాన్) లకు పురస్కారం వరించింది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించిన మాయంక్ అగర్వాల్‌కు కూడా అరుదైన గౌరవం దక్కింది. 2019-2020కి గానూ 7వ విజ్డెన్ వార్షిక పబ్లికేషన్‌లో మయాంక్ కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, విజ్డెన్ పురస్కారానికి ఎంపికైన మూడో భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచారు. ఇంతకు ముందు మాజీ కెప్టెన్ మిథాలిరాజ్, దీప్తి శర్మ ఈ ఘనతను సాధించారు. అలాగే దిగ్గజ ఆటగాళ్లైన గుండప్ప విశ్వనాథ్, లాలా అమర్నాథ్లు విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించారు. -
సంగక్కరకు ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు
లండన్ : శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతనీ అవార్డును గెల్చుకోవడం ఇది రెండోసారి. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ‘విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది.