వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సెకెండ్ సైకిల్ (2021-23)కు సంబంధించి ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ విజ్డెన్.కామ్ తమ అత్యుత్తమ జట్టును ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. డబ్ల్యూటీసీ సీజన్-2 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో విజ్డెన్ తమ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ వివరాలను మీడియాతో షేర్ చేసుకుంది. ఈ జాబితాలో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఒక్కొకరికి విజ్డెన్ చోటు కల్పించింది. డబ్ల్యూటీసీ సీజన్-2లో ప్రదర్శన ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు విజ్డెన్ వివరించింది.
విజ్డెన్ టీమ్ ఆఫ్ డబ్ల్యూటీసీ 2021-23..
- ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా, 16 మ్యాచ్‌ల్లో 69.91 సగటున 6 శతకాలు, 7 హాఫ్‌సెంచరీ సాయంతో 1608 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 195*)
- దిముత్ కరుణరత్నే (శ్రీలంక, 12 మ్యాచ్‌ల్లో 47.90 సగటున 2 సెంచరీలు, 8 హాఫ్‌సెంచరీల సాయంతో 1054 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 147)
- మార్నస్ లబూషేన్ (ఆస్ట్రేలియా, 19 మ్యాచ్‌ల్లో 53.89 సగటున 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 1509 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 204)
- దినేశ్ చండీమాల్ (శ్రీలంక, 10 మ్యాచ్‌ల్లో 68.42 సగటున 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 958 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 206*)
- జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్, 15 మ్యాచ్‌ల్లో 51.40 సగటున 6 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 1285 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 162)
- రిషబ్ పంత్ (భారత్, 12 మ్యాచ్‌ల్లో 43.40 సగటున 2 సెంచరీలు, 5 హాఫ్‌సెంచరీల సాయంతో 868 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 146)
- రవీంద్ర జడేజా (భారత్, 12 మ్యాచ్‌ల్లో 37.38 సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 673 పరుగులు, అత్యుత్తమ స్కోర్ 175*, అలాగే 5 ఫైఫర్‌ల సాయంతో 43 వికెట్లు, అత్యుత్తమ ప్రదర్శన 7/42)
- పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా, 15 మ్యాచ్‌ల్లో 21.22 సగటున 53 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 5/38)
- కగిసో రబాడ (సౌతాఫ్రికా, 13 మ్యాచ్‌ల్లో 26.97 సగటున 67 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 6/50)
- నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా, 19 మ్యాచ్‌ల్లో 26.97 సగటున 83 వికెట్లు, 5 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 8/64)
- జస్ప్రీత్ బుమ్రా (భారత్, 10 మ్యాచ్‌ల్లో 19.73 సగటున 45 వికెట్లు, 3 ఫైఫర్లు, అత్యుత్తమ ప్రదర్శన 5/24)
కాగా, విజ్డెన్ ప్రకటించిన ఈ జాబితాలో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ మాజీ టెస్ట్ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విజ్డెన్ జ్యూరీ శ్రీలంక ఆటగాళ్లకు పెద్ద పీట వేయగా.. న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆటగాళ్లను పూర్తిగా విస్మరించింది. ఇదిలా ఉంటే, జూన్ 7 నుంచి ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment