
న్యూఢిల్లీ: ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు, వన్డే అంతర్జాతీయ జట్లను ఇప్పటికే ప్రకటించిన విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్ ... అత్యుత్తమ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టును సైతం ఎంపిక చేసింది. ఈ దశాబ్దపు విజ్డెన్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించింది. లీగ్ నిబంధనల ప్రకారం నలుగురు విదేశీయులు, ఏడుగురు స్వదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించిన విజ్డెన్.. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్ల గురించి తీవ్రంగా చర్చించింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా నీరాజనాలందుకున్న ధోని, రోహిత్ శర్మలలో ఎవరికి పగ్గాలు అప్పగించాలన్నదానిపై తర్జనభర్జనలు పడ్డ విజ్డెన్.. చివరికి అత్యధికంగా నాలుగుసార్లు ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపిన రోహిత్‌కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. ధోనిని వికెట్‌కీపర్‌గా జట్టులోకి తీసుకుంది.
దశాబ్దపు విజ్డెన్ ఐపీఎల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), క్రిస్ గేల్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, మలింగ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment