మెల్‌బోర్న్ : ఆ్రస్టేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ అబాట్ రెండో టెస్టుకూ దూరమయ్యారు. గజ్జల్లో గాయంతో వార్నర్, కండరాల గాయంతో అబాట్ తొలి టెస్టు ఆడలేకపోయారు. దీంతోపాటే వీళ్లిద్దరు బయో బబుల్ దాటి బయటికి రావడంతో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టు కూడా ఆడే వీలు లేకుండా పోయింది. పైగా వార్నర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు! ‘సిడ్నీలోని నార్తర్న్ బీచ్ వద్ద కరోనా హాట్‌స్పాట్ న్యూసౌత్‌వేల్స్ ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇద్దరు ఆటగాళ్లు కూడా అక్కడి నుంచే మెల్‌బోర్న్‌కు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వాళ్లిద్దరిని జట్టుతో కలిసేందుకు అనుమతించడం లేదు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి : ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..)
శుబ్‌మన్‌కు అవకాశం!
మెల్‌బోర్న్: తొలి టెస్టులో ఎదురైన పరాభవం దృష్ట్యా రెండో టెస్టు కోసం భారత జట్టు పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ కోహ్లి స్వదేశం చేరడంతో తాత్కాలిక కెప్టెన్ రహానే నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓపెనర్ పృథీ్వషా పేలవ ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు ఖాయమనుకుంటున్న శుబ్‌మన్ గిల్ నెట్స్‌లో అదేపనిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 43, 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇతని కంటే పృథ్వీ షా అనుభవజ్ఞుడు కావడంతో అతన్నే ఆడించారు. కానీ షా 0, 4 పరుగులతో జట్టు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో రంజీల్లో పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే 21 ఏళ్ల శుబ్‌మన్‌వైపే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు కూడా నెట్స్‌లో శ్రమించారు. పేసర్లు సిరాజ్, నవ్‌దీప్ సైనీలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment