అబాట్‌కు ‘సోదరి' సాంత్వన! | Phillip Hughes death: Australia's Sean Abbott 'holding up well' | Sakshi
Sakshi News home page

అబాట్‌కు ‘సోదరి' సాంత్వన!

Published Sat, Nov 29 2014 12:20 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

అబాట్‌కు ‘సోదరి' సాంత్వన! - Sakshi

అబాట్‌కు ‘సోదరి' సాంత్వన!

సిడ్నీ: ఫిల్ హ్యూస్ మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఇలాంటి స్థితిలోనూ వారు మరొకరికి ధైర్యం నూరిపోసేందుకు సిద్ధమయ్యారు. అతనెవరో కాదు... హ్యూస్‌కు బంతి విసిరిన పేసర్ సీన్ అబాట్. తన ప్రమేయం లేకపోయినా హ్యూస్ చావుకు కారణమయ్యానంటూ అబాట్ అపరాధ భావంతోనే ఉన్నాడు.

ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అతను ఆ షాక్‌లోంచి బయటికి రాలేకపోతున్నాడు.  దాంతో అతడిని ఓదార్చే బాధ్యత హ్యూస్ సోదరి మెగాన్ తీసుకుంది. ఆస్పత్రి ఆవరణలో వేదనాభరితంగా కనిపిస్తున్న అబాట్ వద్దకు మెగాన్ వెళ్లి కలిసింది. నీ తప్పేమీ లేదంటూ స్వాంతన పలికింది. చాలా సేపు అతనితో మాట్లాడిన మెగాన్... ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న చాలా మందికి కంటతడి పెట్టించింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement