Hughes
-
‘ఎలాన్ మస్క్’కు కేంద్రం భారీ షాక్, దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు!
భారతీయులకు శుభవార్త.త్వరలో మనదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ సంస్థ దేశంలో తొలిసారి హై త్రూపుట్ శాటిలైట్ (హెచ్‌టీఎస్)బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే..దేశంతో పాటు రూరల్ ఏరియాల్లో సైతం హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను వినియోగించుకునే అవకాశం కలగనుంది. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ హ్యూస్ కమ్యూనికేషన్స్ భారత్‌లో తొలిసారి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇస్రో ద్వారా హై త్రూపుట్ శాటిలైట్ (HTS) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఈ శాటిలైట్ సేవల్ని అందించేందుకు ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు అవసరమైన అనుమతుల్ని ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే శాటిలైట్ సర్వీసుల్ని అందించేందుకు కేంద్రం హ్యూస్ కమ్యూనికేషన్‌కు అనుమతి ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. మాలక్ష్యం అదే దేశంలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని అందించడమే హ్యూస్ సంస్థ లక్ష్యం. టెర్రెస్ట్రియల్ (terrestrial) నెట్ వర్క్‌ల తరహాలో వినియోగించే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులతో ఎంటర్ ప్రైజెస్, గవర్న్మెంట్ నెట్‌వర్క్‌లను అనుసంధానం కానున్నాయి. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడటానికి ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి పని చేసే మార్గాలను అన్వేషించడానికి, విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాము" అని స్పేస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ,ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు. -
స్టార్ లింక్‌కు షాక్.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక అడుగు..!
మన దేశంలో అందరి కంటే ముందుగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని చూసిన స్టార్ లింక్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ లింక్ కంటే ముందే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు వన్ వెబ్ సిద్దం అవుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అంధించడానికి ప్రముఖ నెట్వర్క్ సంస్థ భారతి ఎయిర్టెల్, యుకె ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్ వ్యూహాత్మక ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద సంతక చేశాయి. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హైదరాబాద్‌కి చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్‌లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా ఫైబర్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వన్ వెబ్ నెట్వర్క్ పట్టణాలు, గ్రామాలు, స్థానిక & ప్రాంతీయ మున్సిపాలిటీలలోని కష్టతరమైన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలదు అని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. 2022 చివరలో ప్రారంభం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్‌గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ వల్ల దేశంలోని లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు అని వన్ వెబ్ సీఈఓ నీల్ మాస్టర్సన్ తెలిపారు. ఈ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?) -
హ్యూస్, ఎయిర్టెల్ జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) సంస్థలు దేశీయంగా తమ తమ వీశాట్ శాటిలైట్ కార్యకలాపాలను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాయి. విలీన సంస్థలో హ్యూస్కు మెజారిటీ యాజమాన్య అధికారాలు ఉండనుండగా.. ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వాటాలు ఉంటాయని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్ నెట్వర్క్స్, సర్వీసుల సంస్థ హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్‌కు హెచ్‌సీఐఎల్ అనుబంధ సంస్థ. ఇది దేశీయంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలకు బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీలు, సర్వీసులు అందిస్తోంది. కంపెనీలకు, వ్యక్తులకు శాటిలైట్ ఆధారిత టెలికం, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీశాట్ ఉపయోగపడుతుంది. -
అబాట్‌కు ‘సోదరి' సాంత్వన!
సిడ్నీ: ఫిల్ హ్యూస్ మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఇలాంటి స్థితిలోనూ వారు మరొకరికి ధైర్యం నూరిపోసేందుకు సిద్ధమయ్యారు. అతనెవరో కాదు... హ్యూస్కు బంతి విసిరిన పేసర్ సీన్ అబాట్. తన ప్రమేయం లేకపోయినా హ్యూస్ చావుకు కారణమయ్యానంటూ అబాట్ అపరాధ భావంతోనే ఉన్నాడు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అతను ఆ షాక్‌లోంచి బయటికి రాలేకపోతున్నాడు. దాంతో అతడిని ఓదార్చే బాధ్యత హ్యూస్ సోదరి మెగాన్ తీసుకుంది. ఆస్పత్రి ఆవరణలో వేదనాభరితంగా కనిపిస్తున్న అబాట్ వద్దకు మెగాన్ వెళ్లి కలిసింది. నీ తప్పేమీ లేదంటూ స్వాంతన పలికింది. చాలా సేపు అతనితో మాట్లాడిన మెగాన్... ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న చాలా మందికి కంటతడి పెట్టించింది! -
తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం
సిడ్నీ : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కుటుంబ సభ్యులకు వైద్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స జరిగినన్ని రోజులు హ్యూస్ కోలుకునే పరిస్థితిలో లేడని వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పి లేనప్పటికీ...అప్పటికే పరిస్థితి విషమించిందని వారు తెలిపారు. చికిత్స జరిగిన చివరి క్షణం వరకూ అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉన్నారన్నారు. కాగా హ్యూస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. మంగళవారం సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ మ్యాచ్‌లో ఫిల్ హ్యూస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫాస్ట్ బౌలర్ అబాట్ వేసిన బౌన్సర్ బలంగా మెడ, తలకు తగలడంతో హ్యూస్ అక్కడిక క్కడే కుప్పకూలి పోయాడు. దాదాపు నలభై నిమిషాల పాటూ హ్యూస్ నోటిలో నోరుపెట్టి శ్వాస అందించే ప్రయత్నం చేసి అనంతరం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. హ్యూస్ శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వెంటిలేటర్‌ను అమర్చారు. కృత్రిమ కోమాలో ఉన్న హ్యూస్ గురువారం తుది శ్వాస విడిచాడు. మరోవైపు హ్యూస్ మృతితో ఆసీస్ క్రికెట్ జట్టు విషాదంలో మునిగిపోయింది.