తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం | Phillip Hughes has died, cricket Australia team doctor Peter Brukner confirms | Sakshi
Sakshi News home page

తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం

Published Thu, Nov 27 2014 10:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం

తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం

సిడ్నీ : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కుటుంబ సభ్యులకు వైద్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స జరిగినన్ని రోజులు హ్యూస్ కోలుకునే పరిస్థితిలో లేడని వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పి లేనప్పటికీ...అప్పటికే పరిస్థితి విషమించిందని వారు తెలిపారు. చికిత్స జరిగిన చివరి క్షణం వరకూ అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉన్నారన్నారు.  కాగా హ్యూస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.

 మంగళవారం సౌత్‌ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న షెఫీల్డ్‌ షీల్డ్‌ ట్రోఫీ మ్యాచ్‌లో  ఫిల్‌ హ్యూస్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫాస్ట్ బౌలర్‌ అబాట్‌ వేసిన బౌన్సర్‌ బలంగా మెడ, తలకు తగలడంతో హ్యూస్‌ అక్కడిక క్కడే కుప్పకూలి పోయాడు. దాదాపు నలభై నిమిషాల పాటూ హ్యూస్‌ నోటిలో నోరుపెట్టి శ్వాస అందించే ప్రయత్నం చేసి అనంతరం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. హ్యూస్‌ శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వెంటిలేటర్‌ను అమర్చారు. కృత్రిమ కోమాలో ఉన్న హ్యూస్ గురువారం తుది శ్వాస విడిచాడు. మరోవైపు హ్యూస్ మృతితో ఆసీస్ క్రికెట్ జట్టు విషాదంలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement