serious injury
-
హ్యూస్ మృతితో పలుమ్యాచ్ లు పాక్షికంగా రద్దు!
సిడ్నీ: ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతితో పలు మ్యాచ్ లు పాక్షికంగా రద్దయ్యాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా ఎలెవన్ తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలి రోజును రద్దు వేస్తున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ స్సష్టం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ను ఒక రోజు పాటు రద్దు చేస్తున్నట్లు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్, డైరెక్టర్ రవిశాస్త్రిలు ఆటగాళ్లకు తెలిపారు. దీంతో రేపు ఆరంభం కావాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా పాకిస్థాస్, న్యూజిలాండ్ ల మధ్య జరిగే చివరి టెస్టు కూడా ఒక రోజు పాటు రద్దుచేశారు.షెడ్యూల్ ప్రకారం పాక్-కివీస్ ల మ్యాచ్ శుక్రవారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది. ఇరు బోర్డుల అంగీకారంతో ఆ టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజు మ్యాచ్ ను రద్దు చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. -
క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కన్నుమూత
-
హ్యూస్ మరణంపై క్రికెటర్ల స్పందన
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ మరణ వార్తతో యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. హ్యూస్ కు తలకు గాయం కావడంతో కోలుకుంటాడని అందరూ భావించారు. ఆ ఆశలను నిరాశపరుస్తూ హ్యూస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని మరణం నిజంగా క్రికెట్ కు ఒక గాయం. రెండు రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ తీవ్ర్గంగా గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడలేకపోయాడు. క్రికెట్ లో ప్రత్యర్థులపై పోరాడిన హ్యూస్.. మరణాన్ని జయించడంలో విఫలమయ్యాడు. హ్యూస్ మరణవార్తపై పలువురు క్రికెటర్ల ట్విట్టర్లో తమ స్పందన తెలియజేశారు. హ్యస్ కు ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రార్థించాడు. ఆ మరణవార్తను జీర్ణించుకునే శక్తి అతని కుటుంబానికి ఇవ్వాలంటూ శ్రీశాంత్ తన ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు 'హ్యూస్ ఇంత తొందరగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి' అని పీర్స్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఈ మరణవార్త తనను చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోహ్లీ ట్వీట్ చేశాడు. హ్యూస్ కుటుంబానికి అతని ఆత్మకు శాంతి చేకూరాలంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. -
మరో మూడు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే విషాదం
-
మరో మూడు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే విషాదం
సిడ్నీ:ఆసీస్ టాప్ ఆర్డర్ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. రెండు రోజుల క్రితం దేశవాళీ టోర్నీ ఆడుతూ గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. మరో మూడు రోజుల్లో(నవంబర్ 30) హ్యూస్ పుట్టినరోజు ఉండగా ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత్ తో బ్రిస్బేన్ లో జరిగే తొలిటెస్టులో ఆడటానికి దాదాపు మార్గం సుగుమం చేసుకున్న వేళ హ్యూస్ ఇకలేడన్న చేదు వార్త క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138. -
తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం
సిడ్నీ : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కుటుంబ సభ్యులకు వైద్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స జరిగినన్ని రోజులు హ్యూస్ కోలుకునే పరిస్థితిలో లేడని వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పి లేనప్పటికీ...అప్పటికే పరిస్థితి విషమించిందని వారు తెలిపారు. చికిత్స జరిగిన చివరి క్షణం వరకూ అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉన్నారన్నారు. కాగా హ్యూస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. మంగళవారం సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ మ్యాచ్‌లో ఫిల్ హ్యూస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫాస్ట్ బౌలర్ అబాట్ వేసిన బౌన్సర్ బలంగా మెడ, తలకు తగలడంతో హ్యూస్ అక్కడిక క్కడే కుప్పకూలి పోయాడు. దాదాపు నలభై నిమిషాల పాటూ హ్యూస్ నోటిలో నోరుపెట్టి శ్వాస అందించే ప్రయత్నం చేసి అనంతరం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. హ్యూస్ శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వెంటిలేటర్‌ను అమర్చారు. కృత్రిమ కోమాలో ఉన్న హ్యూస్ గురువారం తుది శ్వాస విడిచాడు. మరోవైపు హ్యూస్ మృతితో ఆసీస్ క్రికెట్ జట్టు విషాదంలో మునిగిపోయింది. -
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
-
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం. 2009 లో అరంగేట్రం చేసిన హ్యూస్ 26 టెస్టులు ఆడిన ఆనుభవం ఉంది. ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138. *పూర్తి పేరు-ఫిలిప్ జోల్ హ్యూస్ *జననం- 30 నవంబర్, 1988 *మరణం-27 నవంబర్ 2014 *ముద్దు పేరు-హ్యూస్సీ *బ్యాటింగ్ శైలి-ఎడమ చేతి వాటం *బౌలింగ్ శైలి-కుడి చేతి వాటం *టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, సబ్ స్టిట్యూల్ వికెట్ కీపర్ *టెస్టుల్లో ఆరంగేట్రం - దక్షిణాఫ్రికాపై (ఫిబ్రవరి 29, 2009) *చివరి టెస్టు-ఇంగ్లండ్ పై (జూలై 18,2013) *వన్డేల్లో ఆరంగేట్రం-శ్రీలంకపై ( జనవరి 11,2013) *చివరి వన్డే-పాకిస్థాన్(అక్టోబర్ 12,2014) -
పాత హెల్మెట్ ధరించడం వల్లే...
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ పాత మోడల్ హెల్మెట్ ధరించడం వల్లే అతడు తీవ్రంగా గాయపడటానికి కారణమని హెల్మెట్ తయారీ దారులు చెబుతున్నారు. యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన హెల్మెట్ తయారీ సంస్థ ప్రతినిథి మసూర్ మీడియాతో మాట్లాడుతూ హ్యూస్ ..షెఫిల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ధరించిన హెల్మెట్ లేటెస్ట్ మోడల్‌ది కాదన్నారు. హ్యూస్ ధరించిన హెల్మెట్ గత ఏడాది విడుదలైన మోడల్ అని వివరించారు. లేటెస్ట్ మోడల్లో తలకు పూర్తి రక్షణ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు మనూర్ చెప్పారు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు. కాగా హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతడు ప్రస్తుతం కృత్రిమ కోమాలో ఉన్నాడు. -
క్రికెట్ చాలా డేంజరస్ గేమ్: లారా
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని వెస్టిండీస్ క్రికెటర్ బ్రయాన్ లారా ఆకాంక్షించాడు. క్రికెట్లో ఇటువంటి ప్రమాదకర సంఘటనలు జరుగుతూనే ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు. హ్యూస్ కోలుకోవాలని మొత్తం ప్రపంచంలోని క్రికెట్ ఆటగాళ్లంతా ప్రార్థిస్తున్నారని లారా పేర్కొన్నాడు. క్రికెట్ చాలా ప్రమాదకరమైన ఆట అని... ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కాగా 2004లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ వేసిన బాలు తగిలి లారా ....మైదానంలో కిందపడిపోయిన విషయం తెలిసిందే. -
కృత్రిమ కోమాలోనే క్రికెటర్ హ్యూస్
సిడ్నీ : ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో అతను చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం అతడిని వైద్యులు కృత్రిమ కోమాలోకి తీసుకెళ్లిన విషమం తెలిసిందే. ఈ ఘటనపై వెస్టిండీస్ క్రికెటర్ బ్రయాన్ లారా మాట్లాడుతూ 'హ్యూస్' ఘటన ప్రపంచవ్యాప్తంగా బౌలర్లపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. హ్యూస్కు గాయం కావటం దురదృష్టకరమన్నాడు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపాడు. కాగా దేశవాళీ టోర్నీలో ఆడుతున్న టెస్టు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మైదానంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం. -
హ్యూస్ పరిస్థితి విషమం!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్లో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. దేశవాళీ టోర్నీలో ఆడుతున్న టెస్టు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మైదానంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం. మెదడుకు ఆపరేషన్: స్ట్రెచర్‌పై హ్యూస్‌ను మైదానం బయటికి తీసుకెళ్లి న్యూసౌత్‌వేల్స్ జట్టు డాక్టర్లు తాత్కాలికంగా చికిత్స అందించారు. అయినా తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో వారు నోటి ద్వారా శ్వాసను అందించే ప్రయత్నం చేశారు. అయితే కొద్ది సేపటికే ఎయిర్ అంబులెన్స్‌తో పాటు మరో రెండు అంబులెన్స్‌లు రావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం హ్యూస్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఇప్పటికీ అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను కోమాలోకి వెళ్లకుండా డాక్టర్లు శ్రమిస్తున్నారు. గాయం సంగతి తెలిసిన వెంటనే మైకేల్ క్లార్క్‌తో పాటు పలువురు క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. టెస్టు రేసులో...: ఈ ఆదివారం 26వ పుట్టిన రోజు జరుపుకోనున్న హ్యూస్ భారత్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా టెస్టు జట్టులో స్థానం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి టెస్టులో స్థానం లభించకపోయినా... షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ క్లార్క్ గాయం కారణంగా హ్యూస్కు అవకాశాలు కూడా మెరుగయ్యాయి. గాయపడే సమయానికి అతని జట్టు సౌత్ ఆస్ట్రేలియా స్కోరు 136/2 కాగా... హ్యూస్ 63 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఆసీస్ తరఫున 26 టెస్టులు ఆడిన హ్యూస్, ఆఖరిసారి గత ఏడాది జులైలో బరిలోకి దిగాడు. త్వరగా కోలుకోవాలి: భారత జట్టు ఆకాంక్ష ఫిల్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ జట్టు ఆకాంక్షించింది. ‘హ్యూస్ గాయం దురదృష్టకరం. అతను తొందరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఫిల్ కుటుంబ సభ్యులకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. క్రికెట్ సమాజంతో పాటు ఆస్ట్రేలియాలోని మా భారత మిత్రులు కూడా హ్యూస్ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరుతున్నాం’ అని భారత టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.