సిడ్నీ : ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో అతను చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం అతడిని వైద్యులు కృత్రిమ కోమాలోకి తీసుకెళ్లిన విషమం తెలిసిందే. ఈ ఘటనపై వెస్టిండీస్ క్రికెటర్ బ్రయాన్ లారా మాట్లాడుతూ 'హ్యూస్' ఘటన ప్రపంచవ్యాప్తంగా బౌలర్లపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. హ్యూస్కు గాయం కావటం దురదృష్టకరమన్నాడు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపాడు.
కాగా దేశవాళీ టోర్నీలో ఆడుతున్న టెస్టు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మైదానంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్‌కు తీవ్ర గాయం కావడం గమనార్హం.
కృత్రిమ కోమాలోనే క్రికెటర్ హ్యూస్
Published Wed, Nov 26 2014 12:38 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement