హ్యూస్ మరణంపై క్రికెటర్ల స్పందన
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ మరణ వార్తతో యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. హ్యూస్ కు తలకు గాయం కావడంతో కోలుకుంటాడని అందరూ భావించారు. ఆ ఆశలను నిరాశపరుస్తూ హ్యూస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని మరణం నిజంగా క్రికెట్ కు ఒక గాయం. రెండు రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ తీవ్ర్గంగా గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడలేకపోయాడు. క్రికెట్ లో ప్రత్యర్థులపై పోరాడిన హ్యూస్.. మరణాన్ని జయించడంలో విఫలమయ్యాడు.
హ్యూస్ మరణవార్తపై పలువురు క్రికెటర్ల ట్విట్టర్లో తమ స్పందన తెలియజేశారు.
హ్యస్ కు ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రార్థించాడు. ఆ మరణవార్తను జీర్ణించుకునే శక్తి అతని కుటుంబానికి ఇవ్వాలంటూ శ్రీశాంత్ తన ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు
'హ్యూస్ ఇంత తొందరగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి' అని పీర్స్ మోర్గాన్ పేర్కొన్నాడు.
ఈ మరణవార్త తనను చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోహ్లీ ట్వీట్ చేశాడు.
హ్యూస్ కుటుంబానికి అతని ఆత్మకు శాంతి చేకూరాలంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.